For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

CT 2025: బంగ్లాదేశ్‌తో ఓడితే అంతే: విరాట్ కోహ్లీ

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ మీద కన్నేసిన టీమిండియా.. తొలి మ్యాచ్‌కు సిద్దమైంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్నా.. భారత మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి. మరికొద్ది గంటల్లో బంగ్లాదేశ్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ అంటే తనకు ఇష్టమని, ఈ టోర్నీలో చాలా ఒత్తిడి ఉంటుందని తెలిపాడు. తొలి మ్యాచ్‌లో ఓడితే అంతే సంగతన్నాడు. జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుందని అభిప్రాయపడ్డాడు. బుధవారం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన కోహ్లీ.. బంగ్లాదేశ్‌తో ఫస్ట్ మ్యాచ్‌ను సెంటిమెంట్‌గా భావిస్తున్నట్లు కూడా చెప్పాడు.

Champions Trophy 2025 Virat Kohli Says If you don t start well you are under pressure ahead of IND vs BAN clash

ఓడితే ఒత్తిడే..
'సుదీర్ఘ విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ జరగుతుంది. ఈ టోర్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ టోర్నీలో టాప్-8 టీమ్ మాత్రమే తలపడుతాయి. దాంతో పోటీ స్థాయి తీవ్రంగా ఉంటుంది. వన్డే ఫార్మాట్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీ20 ప్రపంచకప్ తరహా ఒత్తిడిని కలిగిస్తోంది. లీగ్ దశలో మూడు-నాలుగు మ్యాచ్‌లే ఆడాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో శుభారంభం చేయకపోతే తీవ్ర ఒత్తిడికి గురవుతారు. తొలి మ్యాచ్ నుంచే ఒత్తిడి ఉంటుంది. కాబట్టే నాకు ఈ టోర్నీ అంటే ఇష్టం. తొలి మ్యాచ్ నుంచే అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.

ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడటాన్ని నేను సెంటిమెంట్‌గా భావిస్తాను. 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ భారత్.. బంగ్లాదేశ్‌తోనే తొలి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ గెలిచే విజేతగా నిలిచింది. అందుకే తొలి మ్యాచ్‌ను సెంటిమెంట్‌గా భావిస్తున్నాను'అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

కోహ్లీకి నాలుగో టోర్నీ..
విరాట్ కోహ్లీ 2009, 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలు ఆడాడు. ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఫైనల్ చేరి తృటిలో టైటిల్ చేజార్చుకుంది. పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది.

ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిస్తే.. అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన భారత ఆటగాడిగా రోహిత్‌తో కలిసి కోహ్లీ రికార్డు సాధించనున్నాడు. ఈ టోర్నీలో ఆదివారం పాకిస్థాన్‌తో ఆడనున్న టీమిండియా.. మార్చి 2న న్యూజిలాండ్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.

Story first published: Thursday, February 20, 2025, 11:37 [IST]
Other articles published on Feb 20, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+