Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆస్ట్రేలియా X సౌతాఫ్రికా మ్యాచ్‌కు భారీ అడ్డంకి!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌కు భారీ అడ్డంకి ఏర్పడింది. రావల్పిండి క్రికెట్ స్టేడియం వేదికగా ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. దాంతో ఇంకా టాస్ వేయలేదు. సరిగ్గా టాస్ వేసే సమయానికి వర్షం రావడంతో మైదానాన్ని కవర్లతో కప్పేసారు. ప్రస్తుతం అక్కడ వర్షం కురుస్తోంది. వర్షం ఆగిన తర్వాత ఓవర్లను కుదించి ఆటను కొనసాగించే అవకాశం ఉంది.

గ్రూప్-బీలో భాగంగా జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే సెమీస్ బెర్త్ దక్కనుంది. అఫ్గానిస్థాన్‌పై సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా భారీ విజయాలు సాధించాయి. తాజా మ్యాచ్‌లో గెలిచే జట్టుకు గ్రూప్-బీ నుంచి సెమీస్ బెర్త్ దక్కనుంది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.

Champions Trophy 2025 Rain delays Australia vs South africa toss

ఆస్ట్రేలియా జట్టుకు స్టార్ ఆటగాళ్లంతా దూరమైనా.. కుర్రాళ్లతో కూడి జట్టు దుమ్మురేపుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన హైస్కోరింగ్ గేమ్‌లో ఆసీస్ విజయం సాధించింది. స్టీవ్ స్మిత్ సారథ్యంలో ఆ జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. మరోవైపు సౌతాఫ్రికా కూడా బలంగానే ఉంది.

అఫ్గానిస్థాన్‌పై సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ టెంబా బవుతమాతో పాటు ర్యాన్ రికెల్టన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. హెన్రీచ్ క్లాసెన్ కూడా జట్టులోకి వస్తే సౌతాఫ్రికాకు తిరుగుండదు. ఒకవేళ వర్షంతో ఈ మ్యాచ్‌ రద్దయితే చెరొక పాయింట్ కేటాయించనున్నారు.

ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 110 వన్డేలు జరగ్గా.. సౌతాఫ్రికా 55 విజయాలతో పై చేయి సాధించింది. ఆస్ట్రేలియా 51 విజయాలు సాధించగా.. 3 మ్యాచ్‌లు టై అయ్యింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

Story first published: Tuesday, February 25, 2025, 14:45 [IST]
Other articles published on Feb 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+