Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన జియో హాట్‌స్టార్‌!

ప్రముఖ ఓటీటీ యాప్ జియోహాట్ స్టార్ చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అధికారిక ఓటీటీ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్న జియో హాట్‌స్టార్ అత్యధిక కంకరెంట్ వ్యూస్‌ను నమోదు చేసింది. కంకరెంట్ వ్యూస్ అంటే ఒకే సమయంలో వచ్చే వ్యూస్ సంఖ్య. సింపుల్‌గా చెప్పాలంటే రియల్‌టైమ్ యూజర్ల సంఖ్య. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌‌ను జియో హాట్‌స్టార్‌లో ఏకకాలంలో గరిష్టంగా 12 కోట్ల మంది యూజర్లు చూశారు.

ఇది ఓటీటీ యాప్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్. గతంలో హాట్ స్టార్, జియో సినిమా వేర్వేరుగా ఉన్నప్పుడు గరిష్టంగా ఈ సంఖ్య 5 కోట్లు దాట లేదు. జియో సినిమా యాప్‌లో మొత్తం వ్యూస్‌ను డిస్‌ప్లే చేసేవారు. కానీ హాట్‌స్టార్‌లా కంకరెంట్ వ్యూస్ ఇచ్చే వారు కాదు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో హాట్‌ స్టార్‌లో 4 కోట్లకు పైగా కంకరెంట్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకు ఇదే అత్యధికం.

Champions Trophy 2025 PAK vs NZ JioHotstar creates history with highest concurrent viewers

శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మాల్దీవుల దేశాల్లోనూ జియోహాట్‌స్టారే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. దాంతోనే ఈ సంఖ్య పెరిగి ఉంటుందని ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. భారత మ్యాచ్‌ల సందర్భంగా ఈ రికార్డ్ మూడింతలు అయ్యే అవకాశం ఉందని, భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్ సమయంలో ఈ సంఖ్య 30 కోట్లకు కూడా చేరవచ్చని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఐపీఎల్ 2025 ఫైనల్, టీ20 ప్రపంచకప్ ఫైనల్లో గరిష్టంగా 5 కోట్ల రియల్ టైమ్ యూజర్ల సంఖ్య నమోదైంది. తాజాగా ఈ రెండు సంస్థలు భాగస్వామిగా మారి జియో హాట్‌స్టార్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో రికార్డుల మోత మోగుతోంది.

హాట్‌స్టార్‌ను దెబ్బతీసిన జియోసినిమా
హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌ను దెబ్బ కొట్టడానికి రిలయన్స్ సంస్థ.. ఐపీఎల్ హక్కులతో పాటు బీసీసీఐ మ్యాచ్‌ల హక్కులను దక్కించుకొని జియో సినిమాలో ఫ్రీగా ప్రసారం చేసింది. ఆ పోటీని తట్టుకోవడానికి హాట్‌స్టార్ కూడా క్రికెట్ మ్యాచ్‌లను ఫ్రీగా ఇవ్వక తప్పలేదు. దాంతో తీవ్రంగా నష్టపోయిన డిస్నీ హాట్‌స్టార్‌ వాటాను రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసింది.

ఓటీటీ రంగంలో ఇద్దరు శత్రువులు ఒక్కటై పక్కా ప్లానింగ్‌తో జియో హాట్‌స్టార్‌గా బరిలోకి దిగారు. ఇన్నాళ్లు జియో సినిమాలో ఫ్రీగా మ్యాచ్‌లు రాగా.. జియో హాట్‌స్టార్‌తో ఉచిత ప్రసారాలను ఎత్తేసారు. కనీసం రూ. 149తో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్‌ను తీసుకొచ్చారు. జియో మొబైల్ యూజర్లకు కొన్ని ప్రత్యేకమైన రిచార్జ్ ప్లాన్స్‌‌తో ఫ్రీగా జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తోంది.

Story first published: Wednesday, February 19, 2025, 20:10 [IST]
Other articles published on Feb 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+