ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు మరో వివాదం చెలరేగింది. ఆతిథ్య పాకిస్థాన్ మరోసారి తమ నీచ బుద్దిని బయటపెట్టుకుంది. భారత జట్టును దారుణంగా అవమానించింది. ఆటగాళ్ల భద్రతను కారణంగా చూపిస్తూ పాకిస్థాన్‌లో పర్యటించేందుకు బీసీసీఐ అభ్యంతరం చెప్పిన విషయం తెలిసిందే. దాంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేలా పీసీబీని ఐసీసీ ఒప్పించింది.
ఇందుకుగానూ బీసీసీఐ-పీసీబీల మధ్య ఓ ఒప్పందం జరిగింది. భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ తమ మ్యాచ్‌లను తటస్థ వేదికగా నిర్వహించాలని పీసీబీ కోరగా.. అందుకు బీసీసీఐ అంగీకరించింది. అంతేకాకుండా నష్టపరిహారంగా పీసీబీకి ఐసీసీ.. ఓ మెగా టోర్నీని కూడా కేటాయించింది. టోర్నీ నిర్వహణ బడ్జెట్ కూడా పెంచింది. దాంతో భారత్ మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు పీసీబీ ఒప్పుకుంది.

కనిపించని భారత జెండా..
ఇంత చేసినా భారత్‌పై పీసీబీ తన అక్కసు వెళ్లగక్కింది. మరో రెండు రోజుల్లో ఈ టోర్నీకి తెరలేవనుండగా.. కరాచీ స్టేడియంలో చోటు చేసుకున్న ఓ ఘటన భారత అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ఈ స్టేడియంలో అన్ని జట్ల జాతీయ జెండాలను ప్రదర్శించిన పీసీబీ.. భారత దేశ పతాకాన్ని మాత్రం పక్కనపెట్టింది. తమ దేశంలో పర్యటించడం లేదనే సాకుతోనే భారత జెండా ప్రదర్శించకుండా పీసీబీ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది.
కక్ష సాధింపు..
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ తమ నీచ బుద్దిని బయటపెట్టుకుందని, వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భారత జెండాను ప్రదర్శించకపోతే.. టోర్నీని బహిష్కరించాలని కూడా బీసీసీఐకి సూచిస్తున్నారు. భారత్ జెండా ప్రదర్శన చేయకపోవడానికి గల కారణాలను పీసీబీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆ దేశ జర్నలిస్ట్‌లు, నెటిజన్లు మాత్రం.. ఇది ప్రతీకార చర్యగానే పేర్కొంటున్నారు. కరాచీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా,అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇంగ్లండ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. గడాఫీ స్టేడియంలోనూ భారత జెండాను ప్రదర్శించలేదు.
No Indian flag in Karachi: As only the Indian team faced security issues in Pakistan and refused to play Champions Trophy matches in Pakistan, the PCB removed the Indian flag from the Karachi stadium while keeping the flags of the other guest playing nations.
— Nawaz 🇵🇰 (@Rnawaz31888) February 16, 2025
- Absolute Cinema,… pic.twitter.com/2zmcATn7iQ
భారత ఆటగాళ్లను హగ్ చేసుకోవద్దు..
పాకిస్థాన్‌లో పర్యటించేందుకు విముఖత చూపించిన భారత ఆటగాళ్లను హగ్ చేసుకోవద్దని పాకిస్థాన్ ప్లేయర్లకు ఆ దేశ అభిమానులు సూచించారు. ఫిబ్రవరి 23న దాయాదీ దేశాలు భారత్-పాక్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఇంకా వారం రోజుల సమయం ఉన్నా.. అప్పుడే హైప్ క్రియేట్ అయ్యింది. అప్పుడే ఇరు దేశాల అభిమానులు సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.
🚨Controversy erupts as the Indian flag is missing at Karachi stadium ahead of the Champions Trophy 2025. 🇮🇳🏟️#ChampionsTrophy2025 #TeamIndia #KarachiStadium #BCCI #ipl2025schedule #Delhi #Madharasi #Sivakarthikeyan pic.twitter.com/5zgh7QTV1h
— KevellSportz (@KevellSportz) February 17, 2025