For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ ఫ్యాన్స్ హృదయాలను దోచేసిన హాట్ బ్యూటీ ఎవరో తెలుసా?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి గ్రూప్-ఏ టాపర్‌గా సగర్వంగా సెమీఫైనల్‌కు చేరింది. న్యూజిలాండ్‌తో ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 44 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

అయితే ఈ మ్యాచ్‌కు ఇరు దేశాల అభిమానులు, పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా టీవీ కెమెరాల్లో ఓ అమ్మాయి మెరిసింది. అందానికి అసూయ పుట్టేలా ఉన్న ఆమెను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మ్యాచ్ సందర్భంగా ఆ మిస్టరీ గర్ల్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దాంతో ఆ అమ్మాయి ఎవరా? అని నెటిజన్లు ఆరా తీసారు. చాలా మంది దుబాయ్‌లో సెటిల్ అయిన భారత అమ్మాయి అనుకొని పొరబడ్డారు. కానీ ఆమె బాలీవుడ్ హీరోయిన్ అవ్‌నీత్ కౌర్‌గా మరికొంత మంది నెటిజన్లు గుర్తించారు. ఈ మ్యాచ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన అవ్‌నీత్ కౌర్.. కుర్రాళ్ల మనసులను దోచేసింది.

మోడల్, డ్యాన్సర్, సినీ నటి అయిన అవ్‌నీత్ కౌర్.. మర్థానీ సినిమాతో నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. పలు హిందీ చిత్రాలు, సీరియల్స్‌లో నటించడంతో పాటు టీవీ షోల్లో పాల్గొంది. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు కూడా హాజరైన అవ్‌నీత్ కౌర్.. తాజా మ్యాచ్‌లోనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. టీమిండియాకు మద్దతు తెలుపుతూ స్టాండ్స్‌లో ఆమె చేసిన సందడి అభిమానులను ఆకట్టుకుంది.

Champions Trophy 2025 Msytery girl spotted during India vs New Zealand match in Dubai goes viral

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 79) హాఫ్ సెంచరీతో రాణించగా.. అక్షర్ పటేల్(61 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 42), హార్దిక్ పాండ్యా(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(5/42) ఐదు వికెట్లు తీయగా.. కైల్ జెమీసన్, విల్ రూర్కీ, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర తలో వికెట్ తీసారు.

అనంతరం న్యూజిలాండ్ ఓవర్లలో 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. కేన్ విలియమ్సన్(120 బంతుల్లో 7 ఫోర్లతో 81) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. వరుణ్ చక్రవర్తీ(5/42) ఐదు వికెట్లతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్(2/56) రెండు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీసారు. ఈ విజయంతో మంగళవారం దుబాయ్ వేదికగానే జరిగే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది.

Story first published: Monday, March 3, 2025, 7:01 [IST]
Other articles published on Mar 3, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+