Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2025: అప్పుడు జీరో.. ఇప్పుడు హీరో!

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పడానికి టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ప్రయాణమే మంచి ఉదాహరణ. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో జిడ్డు బ్యాటింగ్‌తో టీమిండియా ఓటమికి కారణమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రాహుల్.. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో శనిగాడని తిట్టిన నోర్లే ఇప్పుడు.. శభాష్ రాహుల్ అంటూ ప్రశంసిస్తున్నాయి. జీవితంలో మంచి, చెడు రెండింటికి చోటు ఉంటాయని, కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవద్దని, సంతోషాలకు పొంగిపోవద్దని రాహుల్ క్రికెట్ ప్రయాణం చాటి చెప్పిందని కామెంట్ చేస్తున్నారు. అప్పుడు జీరో అయిన రాహుల్.. ఇప్పుడు హీరో అయ్యాడని అభిప్రాయపడుతున్నారు.

జిడ్డు బ్యాటింగ్‌తో..
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ భారత్ అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరింది. కానీ ఆస్ట్రేలియా జరిగిన కీలక ఫైనల్లో ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్ 107 బంతులు ఎదుర్కొని 66 పరుగులు మాత్రమే చేశాడు. ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్క ఫోర్ బాదాడు. జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ జిడ్డు బ్యాటింగ్ చేశాడనే విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలతో కేఎల్ రాహుల్ చాలా బాధపడ్డాడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటి పాప పరిహారం చేసుకున్నాడు.

Champions Trophy 2025 KL Rahul the unsung hero proves his worth and chase-finishing maestro

ఫైనల్లో రాణించి..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్(34 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫైనల్ ఒత్తిడిని దరిచేయకుండా ప్రశాంతంగా ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

శ్రేయస్ అయ్యర్ ఔటైన అనంతరం తీవ్ర ఒత్తిడిలో ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాడు. చివర్లో హార్దిక్ పాండ్యా ఔటైనా.. జడేజాతో కలిసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. కేఎల్ రాహుల్ ఔటై ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఫైనల్ మ్యాచే కాదు.. కీలమైన సెమీఫైనల్లోనూ అతను సత్తా చాటాడు. దాంతో రాహుల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Story first published: Monday, March 10, 2025, 18:52 [IST]
Other articles published on Mar 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+