Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2025: ఏదో తేడా కొడుతుంది సీనా!

టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన ముగియడంతో అందరి కళ్లు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025‌పై పడ్డాయి. పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు హైబ్రిడ్ మోడల్‌లో ఈ మినీ ప్రపంచకప్ జరగనుంది. టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికైన దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలో నిలిచాయి. ఈ 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభిజించారు.

పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌తో భారత్ గ్రూప్-ఏలో ఉంది. గ్రూప్-బీలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలు ఉన్నాయి. రెండు గ్రూప్స్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో టీమిండియా తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. 23న పాకిస్థాన్‌తో, మార్చి2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. అయితే దుబాయ్‌లో భారత్ మ్యాచ్‌లు జరగనుండటం ఇప్పుడు అభిమానులను కలవరపెడుతోంది.

Champions Trophy 2025 Indian fans worried about spin pitches and records in Dubai

స్పిన్ పిచ్‌లతో టీమిండియాకు సవాల్..
దుబాయ్ పిచ్‌లు స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు చాలా నెమ్మదిగా ఉంటాయి. పైగా తేమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్ కాబట్టి డే/నైట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. లేట్ నైట్ దుబాయ్‌లో విపరీతమైన తేమ వస్తుంది. ఈ పరిస్థితుల్లో టాస్ కీలకంగా మారుతోంది. టాస్ గెలిచిన జట్లు దాదాపు సగం మ్యాచ్ గెలిచినట్లే.

ఇక్కడి పరిస్థితుల్లో ప్రతీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటుంది. సెకండ్ బౌలింగ్ చేసే జట్లకు తేమ ఇబ్బందిగా మారుతోంది. బంతి బాగా తడిచి బౌలర్లకు పట్టుచిక్కదు. ఈ పరిస్థితులు టీమిండియా విజయవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కరోనా సమయంలో ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించగా.. ఎక్కువగా టాస్ గెలిచిన జట్లే విజేతగా నిలిచాయి.

స్పిన్‌కు తడబాటు..
అంతేకాకుండా ఈ మధ్య కాలంలో భారత బ్యాటర్లు స్పిన్‌కు తడబడుతున్నారు. గతేడాది శ్రీలంక పర్యటనలో స్పిన్ బౌలింగ్ ఆడలేక వన్డే సిరీస్‌ను 2-0తో కోల్పోయారు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన 3 టెస్ట్‌ల సిరీస్‌ను స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోలేక 3-0తో క్లీన్ స్వీప్ అయ్యారు. ఒకప్పుడు స్పిన్ అంటే టీమిండియా పండుగ చేసుకునేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

కలవరపెడుతున్న రికార్డ్స్..
దుబాయ్ వేదికగానే జరిగిన 2021 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ఆ తర్వాత న్యూజిలాండ్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా టాస్ ఓడి మూల్యం చెల్లించుకుంది. ఆ తర్వాత అఫ్గానిస్థాన్, స్కాట్ లాండ్, నమీబియా వంటి చిన్నదేశాలపై గెలిచినా లాభం లేకపోయింది. ఈ రికార్డే అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.

పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినా టీమిండియాకు విజయవకాశాలు దక్కేవని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్ల సెక్యూరిటీని సమస్యగా చూపించి బీసీసీఐ హైబ్రిడ్ మోడల్‌కు పట్టుబట్టింది. కానీ అది భారత జట్టుకు తీవ్ర నష్టం చేసేలా ఉందని ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. స్పిన్‌ను సమర్థవంతంగా ఆడే బ్యాటర్లను జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. కొందరైతే 'దుబాయ్‌లో మ్యాచ్‌లంటే.. ఏదో తేడా కొడుతుంది సీనా'అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా షెడ్యూల్..
ఫిబ్రవరి 20, 2025: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, దుబాయ్ (మధ్యాహ్నం 2 గంటలకు)

ఫిబ్రవరి 23, 2025: భారత్ వర్సెస్ పాకిస్థాన్, దుబాయ్(మధ్యాహ్నం 2 గంటలకు)

మార్చి 2, 2025: భారత్ వర్సెస్ న్యూజిలాండ్, దుబాయ్(మధ్యాహ్నం 2 గంటలకు)

Story first published: Tuesday, January 7, 2025, 20:25 [IST]
Other articles published on Jan 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+