Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CT 2025: భారత్ X న్యూజిలాండ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు..?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఆదివారం న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదికగా జరిగే గ్రూప్-ఏ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే వరుస విజయాలతో భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. అయితే గ్రూప్-ఏ టాపర్ ఎవరు? అనేది ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితం తేల్చనుంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. బలాల పరంగా ఇరు జట్లు సమంగా ఉండటంతో పాటు వరుస విజయాలతో ఉత్సాహంగా ఉన్నాయి. దాంతో ఆ పోరు ఆసక్తికరంగా సాగనుంది.

అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటికే వరణుడు మూడు మ్యాచ్‌లను మింగేసాడు. కీలకమైన ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా, పాకిస్థాన్-బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా-అఫ్గానిస్థాన్ మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా, పాకిస్థాన్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లు అయితే ఒక్క బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయాయి. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కళ తప్పింది. ఆతిథ్య పాకిస్థాన్‌తో పాటు బ్రాడ్ కాస్టర్స్‌కు భారీ నష్టాలను తెచ్చి పెట్టింది.

Champions Trophy 2025 India vs New Zealand Weather and Pitch report of Dubai

దుబాయ్ వెదర్ రిపోర్ట్:
ఈ క్రమంలోనే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందా? అనే భయం క్రికెట్ ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే రద్దయిన మ్యాచ్‌లన్నీ పాకిస్థాన్‌ వేదికగా జరగాల్సినవి. కానీ భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు భారత్ రెండు మ్యాచ్‌లు ఆడి గెలిచింది. ఎలాంటి అంతరాయం కలగలేదు. ఆదివారం కూడా ఎలాంటి వర్షం ముప్పు లేదు. వాతావరణం కూడా సాధారణంగా ఉండనుంది.

ఆక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం గరిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవ్వనుంది. వాతావరణం చల్లగా ఉండటనుండటంతో డ్యూ ప్రభావం కూడా ఉండకపోవచ్చు. దాంతో టాస్ గెలిచే టీమ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. అయితే టీమిండియా గత రెండు మ్యాచ్‌ల్లో ముందుగా ఫీల్డింగ్ చేసే విజయం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా టాస్ ఓడింది.

పిచ్ రిపోర్ట్:
దుబాయ్ పిచ్ నెమ్మదిగా ఉండనుంది. స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. డ్యూ వస్తే మాత్రం ఛేజింగ్‌ టీమ్‌కు అనుకూలంగా మారుతోంది. మంచు ప్రభావం లేకుంటే మాత్రం పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా మారుతోంది. మ్యాచ్ సాగుతున్నా కొద్ది వికెట్ల స్లో‌గా మారుతోంది. డ్యూ లేకుంటే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోనుంది.

Story first published: Saturday, March 1, 2025, 18:42 [IST]
Other articles published on Mar 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+