Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2025: దుబాయ్‌లో భారత్ రికార్డ్ ఏలా ఉందంటే..?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి రంగం సిద్దమైంది. మరికొన్ని గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్థాన్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. బుధవారం పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఆటగాళ్ల భద్రతా కారణాలతో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేలా ఐసీసీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ని ఒప్పించింది. దాంతో భారత్ మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగానే జరగనున్నాయి. ఒకవేళ భారత్ సెమీఫైనల్, ఫైనల్ చేరితే ఆ మ్యాచ్‌లు కూడా దుబాయ్ వేదికగానే జరగనున్నాయి.

గురువారం భారత్ తొలి పోరు..
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో టీమిండియా తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్‌తో హైఓల్టేజ్ మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. మార్చి 2న న్యూజిలాండ్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. 2013లో చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2017లో తృటిలో టైటిల్ చేజార్చుకుంది. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఓటమిపాలైంది. ఈసారి పటిష్టంగా ఉన్న టీమిండియా.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది.

Champions Trophy 2025 India ODI Record and Key Player Stats in Dubai

ఒకే వేదికలోనే భారత్ మ్యాచ్‌లు..
ఈ టోర్నీలో టీమిండియా విజయం సాధించాలంటే వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలవాలి. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లు గెలవడంతో పాటు సెమీస్, ఫైనల్ గెలిస్తేనే టైటిల్ దక్కుతుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీని నాకౌట్ టోర్నీ అంటారు. భారత్ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోని ఒకే వేదికగా జరగనుండటం కలిసొచ్చే అంశం. ఇతర జట్లలా ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. పిచ్ కండిషన్స్‌ను రీడ్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఒకసారి అలవాటు పడి లీగ్ దశలో మెరుగ్గా రాణిస్తే.. సెమీస్, ఫైనల్లో టీమిండియాకు దుబాయ్ హోమ్ గ్రౌండ్‌లా మారనుంది.

టీమిండియా ట్రాక్ రికార్డ్ సూపరో సూపర్..
ఇక దుబాయ్‌లో టీమిండియాకు మెరుగైన రికార్డ్ ఉండటం కలిసొచ్చే అంశం. మూడు ఫార్మాట్లలో కలిపి ఇక్కడ మొత్తం 15 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 10 విజయాలతో పాటు 4 పరాజయాలను నమోదు చేసింది. మరో మ్యాచ్‌ ఫలితం తేలకుండా ముగిసింది. వన్డేల్లో అయితే టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. దుబాయ్‌లో ఇప్పటి వరకు 6 వన్డేలు ఆడిన టీమిండియా ఐదింటిలో గెలిచింది. ఒక మ్యాచ్ టై అయ్యింది. అది కూడా 2018 ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కోర్లు టై అయ్యాయి.

అతనే టాప్ బౌలర్..
దుబాయ్ వేదికగా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 68.40 సగటుతో 342 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత రోహిత్ 105.66 సగటుతో 317 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీతో పాటు 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దుబాయ్ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో కుల్దీప్ యాదవ్ టాప్‌లో ఉన్నాడు. అతను 4.08 ఎకానమీతో కుల్దీప్ యాదవ్ 10 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా 2018 ఆసియాకప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4/29 అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశాడు.

Story first published: Tuesday, February 18, 2025, 18:33 [IST]
Other articles published on Feb 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+