Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2025: పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే..?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆతిథ్య పాకిస్థాన్ శుభారంభం చేయలేకపోయింది. న్యూజిలాండ్‌తో బుధవారం కరాచీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన పాకిస్థాన్ 60 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. 29 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్.. అనూహ్య పరాజయంతో తమ అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. ఈ ఘోర పరాజయం పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చింది. అయితే ఈ మ్యాచ్‌లో ఓడినా.. పాకిస్థాన్‌కు సెమీస్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి.

పాక్ సెమీస్ చేరాలంటే..?
గ్రూప్-ఏలో ఉన్న పాకిస్థాన్ తమ తదుపరి మ్యాచ్‌ల్లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 23(ఆదివారం)న భారత్‌తో దుబాయ్ వేదికగా హైఓల్టేజ్ మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌తో చివరి లీగ్ మ్యాచ్‌లో తలపడనుంది. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే ఈ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించాలి. అంతేకాకుండా భారత్, బంగ్లాదేశ్ జట్లు రెండేసి మ్యాచ్‌లు ఓడిపోవాలి. అప్పుడే పాకిస్థాన్ 4 పాయింట్స్‌తో గ్రూప్-ఏ టాప్-2లో చోటు దక్కించుకుంటుంది. ఒకవేళ భారత్, న్యూజిలాండ్ ఒక్కో మ్యాచ్‌లో ఓడి నాలుగు పాయింట్స్ సాధిస్తే రన్‌రేట్ కీలకం అవుతోంది.

Champions Trophy 2025 How Can Pakistan Qualify For Semi-Final After Loss against New Zealand

ఒక్క మ్యాచ్ ఓడినా..
మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్లకు సెమీస్ బెర్త్ దక్కుతుంది. అయితే తొలి మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఓడిన పాకిస్థాన్ రన్‌రేట్ నెగటీవ్‌గా మారింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తేనే పాకిస్థాన్ రన్‌రేట్ మెరుగవుతోంది. అలా కాకుండా ఒక్క మ్యాచ్ ఓడినా పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలవడం కష్టమే. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు నాకౌట్‌గా మారింది.

తేలిపోయిన పాక్..
ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 330 పరుగులు చేసింది. విల్ యంగ్(113 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 107), టామ్ లాథమ్(104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118 నాటౌట్) సెంచరీలతో రాణించారు. గ్లేన్ ఫిలిఫ్స్((39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా(2/63), హ్యారీస్ రౌఫ్(2/80) రెండేసి వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం పాకిస్థాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకు కుప్పకూలి ఓటమిపాలైంది. కుష్దిల్ షా(49 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 69 ), బాబర్ ఆజామ్(90 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 64) హాఫ్ సెంచరీలతో రాణించగా.. సల్మాన్ అఘా(28 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ రూర్కీ(3/47), మిచెల్ సాంట్నర్(3/66) మూడేసి వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ(2/25) రెండు వికెట్లు పడగొట్టాడు. నాథన్ స్మిత్, మైకేల్ బ్రేస్‌వెల్ తలో వికెట్ తీసారు. బాబర్ జిడ్డు బ్యాటింగ్ పాక్ విజయవకాశాలను దెబ్బతీసింది.

Story first published: Thursday, February 20, 2025, 6:05 [IST]
Other articles published on Feb 20, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+