PAK vs NZ: ఓయ్ ఫిలిప్స్.. నువ్వు మనిషివా? పక్షివా?(వీడియో)
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆతిథ్య పాకిస్థాన్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లోనే అద్భుతంగా ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ఫిలిప్స్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. టోర్నీ ఆఫ్ ది క్యాచ్‌గా నిలుస్తుందని కొనియాడుతున్నారు. ఓయ్ ఫిలిప్స్.. నువ్వు మనిషివా? పక్షివా? అని ప్రశ్నిస్తున్నారు. 'తొలి మ్యాచ్‌లోనే నీ విన్యాసాలు మొదలు పెట్టావా?'అని కామెంట్ చేస్తున్నారు.
గ్లేన్ ఫిలిప్స్ సెన్సేషనల్ క్యాచ్‌కు పాకిస్థాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్(3) నిరాశగా పెవిలియన్ చేరాడు. న్యూజిలాండ్ పేసర్ విల్ ఓ రూర్కీ వేసిన 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఆఖరి బంతిని ఓ రూర్కీ.. వైడ్‌గా షార్ట్ బాల్ వేయగా రిజ్వాన్ కట్ షాట్ ఆడాడు. కానీ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న గ్లేన్ ఫిలిప్స్ ఎడమ వైపు డైవ్ చేసి బంతిని ఒంటి చేత్తో అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను చూసి మహమ్మద్ రిజ్వాన్ నోరెళ్లబెట్టాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ యంగ్(113 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 107), టామ్ లాథమ్(104 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 118 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. గ్లేన్ ఫిలిఫ్స్((39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) విధ్వంసకర హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా(2/63), హ్యారీస్ రౌఫ్(2/80) రెండేసి వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు. ఆఖరి 10 ఓవర్లలోనే న్యూజిలాండ్ 113 పరుగులు చేయడం గమనార్హం. మిడిల్ ఓవర్లలో పాకిస్థాన్ బౌలర్లు తేలిపోయారు. ముఖ్యంగా స్పిన్నర్లు వికెట్లు తీయలేకపోయారు. మిడిల్ ఓవర్లలో పాకిస్థాన్ బౌలర్ల వైఫల్యం న్యూజిలాండ్‌కు కలిసొచ్చింది.
#ChampionsTrophy2025#ChampionsTrophy #PAKvNZ | #NZvsPAK
— 28.71 87.23.66 IB (@IamAtulSri0308) February 19, 2025
Glenn Philips, what a catch
you absolute bird 🤯🤯🤯 pic.twitter.com/poyUycmu88
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications