Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Champions Trophy 2024 టోర్నీకి ముందు పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. ఆ సిరీస్ కూడా దేశం బయటే!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్‌కు ఆ టోర్నీకి ముందే బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనడంపై ఇతర దేశాల జట్లు అయిష్టతను కనబరుస్తున్నాయి. టీమిండియా అయితే తమ మ్యాచ్‌లను తటస్థ వేదికగా నిర్వహించాలని ఐసీసీని డిమాండ్ చేస్తోంది.

మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ స్టేడియాలను రినోవేషన్ చేస్తోంది. అయితే స్టేడియాల పునరుద్దరణనే ఇప్పుడు పీసీబీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. స్టేడియాల రినోవేషన్ కారణంగా.. ఇంగ్లండ్‌తో అక్టోబర్‌లో జరగాల్సిన మూడు టెస్ట్‌ల సిరీస్ నిర్వహణ పీసీబీకి సవాల్‌గా మారింది. ఈ సిరీస్‌ను దేశం ధాటించాల్సిన పరిస్తితి ఏర్పడింది.

Champions Trophy 2024 Big Blow For Pakistan England Series To Be Shifted Out Of Country

షెడ్యూల్ ప్రకారం ఇంగ్లండ్‌తో అక్టోబర్ 7 నుంచి 11 మధ్య ముల్తాన్ వేదికగా తొలి టెస్ట్, అక్టోబర్ 15 నుంచి 19 మధ్య కరాచీ వేదికగా రెండో టెస్ట్, అక్టోబర్ 24-28 మధ్య రావల్పిండి వేదికగా మూడో టెస్ట్ జరగాల్సి ఉంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం లాహోర్, కరాచీ, రావల్పిండి స్టేడియాలను పీసీబీ రినోవేషన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

దాంతో బంగ్లాదేశ్‌తో కరాచీ వేదికగా జరగాల్సిన రెండో టెస్ట్‌ను రావల్పిండి వేదికగానే నిర్వహించారు. ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను యూఏఈకి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రినోవేషన్ ప్రక్రియను ఆపి సిరీస్‌ను నిర్వహిస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీకి మైదానాలు సిద్దం కావు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది.

అభిమానులు లేకుండా ఈ సిరీస్ నిర్వహించడం పీసీబీ ముందున్న మరో ఆప్షన్. కానీ ఇంగ్లండ్‌కు భారీ ఫ్యాన్స్‌ ఉన్న నేపథ్యంలో ఈసీబీ ఇందుకు అంగీకరించకపోవచ్చు. ముఖ్యంగా బార్మీ ఆర్మీ పేరిట ఇంగ్లండ్ అభిమానులు తమ జట్టు టెస్ట్ సిరీస్‌లకు పెద్ద ఎత్తున హాజరవుతారు. ప్రస్తుతం ఈ సిరీస్ విషయంపై ఈసీబీతో పీసీబీ చర్చలు జరుపుతున్నట్లు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఈ సిరీస్ కోసం యూఏఈతో పాటు శ్రీలంకను పీసీబీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

యూఏఈ వేదికగా మహిళల టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో అక్కడ ఈ సిరీస్ నిర్వహించే అవకాశం లేదు. సరిగ్గా ఈ సిరీస్ షెడ్యూల్ సమయంలోనే అమ్మాయిల టీ20 ప్రపంచకప్ జరగనుంది. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఓటమితో 8వ స్థానానికి పడిపోయిన పాకిస్థాన్ జట్టుకు ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ గెలవడం చాలా ముఖ్యం. ఫిబ్రవరి 2021 నుంచి ఇప్పటి వరకు సొంతగడ్డపై పాకిస్థాన్ ఒక్క టెస్ట్ మ్యాచ్ గెలవలేదు.

Story first published: Thursday, September 5, 2024, 17:56 [IST]
Other articles published on Sep 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+