For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత ఆటగాళ్లు ఐదు క్యాచ్‌లు వదిలేస్తే సెంచరీ చేశా: స్మిత్‌

Century in Pune Test vs India was a fluke, claims Steve Smith

సిడ్నీ: 2016-17‌లో జరిగిన పుణే టెస్టులో నేను ఇచ్చిన క్యాచ్‌లను భారత ఆటగాళ్లు ఐదు సార్లు వదిలేశారు కాబట్టే సెంచరీ చేశా అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. భారత గడ్డపై 2016-17లో పుణేలో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్‌ అద్భుత శతకం (109) బాదాడు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మన ఆటగాళ్లు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఒకే ఒక అర్ధ సెంచరీ నమోదు చేయగా.. స్మిత్ మాత్రం సెంచరీ చేసాడు.

333 పరుగులతో ఆసీస్ విజయం:

333 పరుగులతో ఆసీస్ విజయం:

ఆ సమయంలో స్టీవ్ స్మిత్‌ సాధించిన సెంచరీ భారత గడ్డపై విదేశీ ఆటగాళ్లు చేసిన అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచిపోయింది. స్మిత్ పోరాటంతో ఆసీస్‌ ఆ టెస్టులో 333 పరుగులతో విజయం సాధించింది. అయితే స్మిత్ ఆ ఇన్నింగ్స్‌ను తాజాగా గుర్తుచేసుకున్నాడు. మాజీ కెప్టెన్ సోమవారం ఇన్‌స్టా వేదికగా చిట్‌చాట్ చేశాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానమిచ్చాడు. ఆ ఇన్నింగ్స్‌ గురించి ఓ అభిమాని అడగ్గా.. స్మిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జారవిడిచిన క్యాచ్‌ల కారణంగానే అది గొప్ప ఇన్నింగ్స్‌ అయిందన్నాడు.

అదృష్టం కలిసొచ్చింది:

అదృష్టం కలిసొచ్చింది:

'అదృష్టం కలిసొచ్చింది. నేను ఇచ్చిన క్యాచ్‌లను భారత ఆటగాళ్లు ఐదు సార్లు వదిలేశారు. అంటే ఒక్కోదానికి లెక్క వేసుకుంటే ఐదు సార్లు 20 పరుగుల చొప్పున చేశానంతే' అని స్మిత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ చాట్‌లో అభిమానికి బదులిచ్చాడు. ఈ చాట్‌లో భారత క్రికెటర్ల గురించి కూడా అతను తన అభిప్రాయాలు వెల్లడించాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై స్మిత్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుత క్రికెట్‌ ప్రపంచంలో జడేజానే బెస్ట్ ఫీల్డర్ అని కితాబిచ్చాడు.

 ధోనీ ఓ దిగ్గజం:

ధోనీ ఓ దిగ్గజం:

భారత బ్యాట్స్‌మెన్లలో తనను బాగా ఇంప్రెస్ చేసిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ పేరు చెప్పాడు స్టీవ్ స్మిత్. అలాగే బ్యాటింగ్ విషయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ రాక్షసుడిలాంటి వాడని పేర్కొన్నాడు. పాక్‌ బౌలర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ను ఎదుర్కోవడంలో తాను ఇబ్బంది పడతానని వెల్లడించాడు. ఇక భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఓ దిగ్గజంగా అభివర్ణించాడు. స్మిత్ ఆసీస్ తరఫున ఇప్పటి వరకు 73 టెస్టులు, 125 వన్డేలు, 39 టీ20లు ‌ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 35 సెంచరీలు బాదాడు.

ఐపీఎల్ ఆడుతా:

ఐపీఎల్ ఆడుతా:

ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టీ20 ప్రపంచకప్‌ వాయిదాపడి.. ఆ స్థానంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2020 జరిగితే తాను కచ్చితంగా ఆడతానని స్టీవ్‌ స్మిత్‌ ఇటీవలే అన్నాడు. ఈ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న స్మిత్..‌ ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతిస్తే భారత్‌కు ప్రయాణించేందుకు అభ్యంతరం లేదన్నాడు. కరోనా వైరస్‌ కారణంగా ఏప్రిల్‌-మేలో జరగాల్సిన ఐపీఎల్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచకప్‌ నిర్వహించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.

కంటతడి పెట్టిన నొవాక్‌ జొకోవిచ్‌!!

Story first published: Tuesday, June 16, 2020, 12:30 [IST]
Other articles published on Jun 16, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+