
ప్రతీసారి ఎగిరి గంతులేశాం:
1983 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను స్నేహితులతో కలిసి చూశానని, వెస్టిండీస్ వికెట్ పడిన ప్రతీసారి గంతులు వేశామని మాస్టర్ బ్లాస్టర్ ట్వీట్ చేశాడు. 'ఫైనల్లో భారత బౌలర్లు విండీస్ ఆటగాళ్ల వికెట్లు తీయడం నేను, నా స్నేహితులు ఎంతో ఆస్వాదించాం. గార్డన్ గ్రీనిడ్జ్ (1) వికెట్ తీసిన బల్విందర్ సంధూ తొలి బంతి నుంచీ కపిల్ దేవ్ అందుకున్న వీవ్ రిచర్డ్స్ (33) అధ్బుత క్యాచ్ వరకు అన్నీ చూశాం. ప్రతీ వికెట్‌కూ మేం ఎగురుతూ సంబరపడ్డాం. నేనైతే ఎగిరి గంతులేశా. అది ఎంతో సంతోషకరమై సాయంత్రం' అని సచిన్ పేర్కొన్నాడు.

తల్లిదండ్రుల మైండ్‌సెట్‌ను మార్చింది:
ఆ నాటి విజయాన్ని ఆ జట్టు సభ్యుడు కపిల్ దేవ్ గుర్తుచేసుకున్నాడు. టీమిండియా స్ఫూర్తిదాయక విజయం భారత్‌లోని తల్లిదండ్రుల మైండ్‌సెట్‌ను మార్చిందని కపిల్ అన్నాడు. జీవితంలో క్రీడల ప్రాముఖ్యతను పిల్లలకు బోధించడం అలవర్చుకున్నారని చెప్పా డు. 'మా జట్టు విజయం పట్ల ఎంతో గర్వంగా ఉన్నాం. కప్‌ను గెలవడం ఓ అద్భుతం. దేశం మొత్తం సంబరాలు చేసుకుంది. అప్పటి నుంచి ఆటల పట్ల తల్లిదండ్రుల్లో సానుకూల దృక్పథం పెరిగింది' అని కపిల్ సంతోషం వ్యక్తం చేశాడు.

మరిచిపోలేని దృశ్యం:
ఫైనల్ విజయంపై కోచ్ రవిశాస్త్రి, మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ పోస్టులు చేశారు. '1983 జూన్ 25న ప్రపంచ ఛాంపియన్లుగా అవతరిస్తామని అనుకున్నాం. అలాగే గెలిచాం. అలా భారతలో క్రికెట్ స్వరూపాన్నే మార్చేశాం. ఈ సందర్భంగా అప్పటి కపిల్ డెవిల్స్‌కు, భారతీయులకు ధన్యవాదాలు' అని రవిశాస్త్రి ట్వీట్ చేసాడు. 'నాడు లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్‌ను అందుకున్న కపిల్ ఫొటో భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని దృశ్యం. మన దేశంలో క్రికెట్ మార్పునకు అదే కారణం. అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చని ఈ విజయం భావితరాలకు స్ఫూర్తిగా నిలిచింది' అని మహ్మద్ కైఫ్ పేర్కొన్నాడు.

అమర్‌నాథ్ ఆల్‌రౌండ్ షో:
ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 54.4 ఓవర్లలో 183 పరుగులు చేసి ఆలౌటైంది. కృష్ణమాచారి శ్రీకాంత్ (38), మోహిందర్ అమర్‌నాథ్ (26), సందీప్ పాటిల్ (27) మోస్తరుగా రాణించారు. అనంతరం భారత బౌలర్లు చెలరేగడంతో విండీస్ 140 పరుగులకే కుప్పకూలింది. మదన్‌లాల్, మోహిందర్ చెరో మూడు వికెట్లు చేయగా.. సంధు రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ 43 పరుగులతో మాజీ ఛాంపియన్‌ను మట్టికరిపించింది. మోహిందర్ అమర్‌నాథ్ బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో అంతకుముందు లీగ్ దశలో జింబాబ్వేతో గెలవాల్సిన మ్యాచ్‌లో కపిల్ 175 పరుగులతో చెలరేగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications

మొక్కలు నాటిన టీమిండియా క్రికెటర్!!










