రిషభ్ పంత్ కారు ప్రమాదం.. నగలు, విలువైన వస్తువులు దొంగలించిన జనాలు! (వీడియో)

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అతను ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ రేలింగ్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దాంతో వాహనంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా హరిద్వార్ జిల్లాలో మంగళూరు, నర్సన్ మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్వయంగా కారు డ్రైవ్ చేసిన పంత్.. నిద్రమత్తులో కారు నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో పంత్ ఒక్కడే కారులో ఉన్నాడని, కారు అద్దాలను పగలగొట్టుకొని బయటకు వచ్చాడని చెప్పారు.
రిషభ్ పంత్ చాలా లక్కీ..
ప్రమాదం తీవ్రత చూస్తుంటే అదృష్టవశాత్తు రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడ్డాడని తెలిపారు. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ తల, కాళ్లు, వీపు భాగంలో గాయాలైనట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్‌కు నిర్వహించిన మొదటి ఎక్స్‌రేలో ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదని తేలింది. అయితే డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తేనే అతని గాయాల తీవ్రతపై క్లారిటీ రానుంది. కారు రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత అందులో నుంచి బయటికి వచ్చేందుకు రిషభ్ పంత్ తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అద్దాలు పగలగొట్టుకొని బయటకు దూకినట్లు తెలుస్తోంది. అలా దూకడం వల్లే పంత్ ప్రాణాలతో బయటపడినట్లు అర్థమవుతోంది.
విలువైన నగలు, వస్తువులతో..
కారు, రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టిన 6 నిమిషాల తర్వాత మంటలు వ్యాపించాయి. మంటలు రావడానికి ముందే అటుగా వెళ్తున్న వాహనదారులతో పాటు స్థానికులు, కారు ప్రమాదాన్ని గుర్తించారు. కారుకు దూరంగా పడి ఉన్న పంత్‌కు సాయం చేస్తున్న ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రమాద సమయంలో వేగంగా కారు వద్దకి వచ్చిన జనాలు, కారులో ఇరుక్కున్న రిషభ్ పంత్‌ను రక్షించడానికి బదులుగా అందులో ఉన్న విలువైన నగలు, వస్తువులు తీసుకుని పారిపోయాయినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలను ఉత్తరాఖండ్ పోలీసులు దృవీకరించాల్సి ఉంది.
తల్లిక్ సర్‌ప్రైజ్ ఇవ్వాలని..
న్యూ ఇయర్‌కు తల్లికి సర్‌ప్రైజ్ ఇవ్వాలని ఇంటికి బయలుదేరిన రిషభ్ పంత్, తల్లి, సోదరి కోసం కొన్ని కానుకలు కొనుగోలు చేశాడు. అలాగే రిషబ్ పంత్‌కు ఉండే బంగారు గొలుసు, బ్రాస్‌లైట్ వంటి ఖరీదైన వస్తువులు అపహరణకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రిషభ్ పంత్ కోలుకుని, ఈ విషయంపై నోరు విప్పితే కానీ అసలు ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇక కారు మొత్తం మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. కారు మంటల్లో కాలిపోతున్న చాలామంది వాహనదారులు పట్టించుకోకుండా పక్కనుంచి వెళ్లిపోవడం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డైంది.
కొందరు స్థానికుల సాయంతో..
తీవ్ర గాయాలతో పడి ఉన్న రిషభ్ పంత్‌ను గుర్తించిన మరికొందరు ప్రయాణీకులు మాత్రం అతనికి సాయం చేసి, పక్కనే ఉన్న ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సమాచారం అందుకోవడం.. ఉత్తరఖాండ్ సీఎం ఆదేశాలతో అధికారులు హుటాహుటినా సహాయక చర్యలు చేపట్టారు. అవసరమైతే హెలీక్యాప్టర్ ద్వారా పంత్‌ను ఆసుపత్రికి తరలించాలని సీఎం ఆదేశించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications