సెలెబ్రిటీ లీగ్ (CCL 2026) చివరి లీగ్ మ్యాచ్‌లో సౌత్ టీమ్స్ సత్తా చాటాయి. టాలీవుడ్‌కు చెందిన తెలుగు వారియర్స్ నిరాశపర్చినా.. కర్ణాటక బుల్డోజర్స్, వెల్స్ చెన్నై కింగ్స్, కేరళ స్ట్రైకర్స్ నాకౌట్‌కు అర్హత సాధించాయి. నార్త్ ఇండియా నుంచి బెంగాల్ టైగర్స్ మాత్రమే సెమీఫైనల్ చేరింది.
గత ఆదివారం బాలీవుడ్‌కు చెందిన ముంబై హీరోస్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోలివుడ్ టీమ్ చెన్నై కింగ్స్ 56 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో నిలిచి నాకౌట్ బెర్త్ ఖరారు చేసుకుంది.
చెన్నై కింగ్స్ ప్లేయర్, ఎల్బీడబ్ల్యూ హీరో విక్రాంత్ సంతోష్ భారీ శతకంతో ముంబై హీరోస్ పతనాన్ని శాసించాడు. 66 బంతుల్లో 17 ఫోర్లు, 10 సిక్స్‌లతో 149 పరుగులు చేశాడు. 225 స్ట్రైక్‌రేట్‌తో ముంబై బౌలర్లను ఊచకోత కోసాడు. అతనికి తోడుగా రమణ అమర్(32), పృథ్వీ పండిరాజన్(33) రాణించారు. దాంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగుల భారీ స్కోర్ చేసింది.
అనంతరం ముంబై హీరోస్ 19.4 ఓవర్లలో 166 పరుగులు చేసి ఓటమిపాలైంది. సకిబ్ సలీమ్(33 బంతుల్లో 59) హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. అతనికి తోడుగా మరే బ్యాటర్ రాణించలేదు. చెన్నై తరఫున శరణ్ కుమార్, అధవ్, అశోక్ సెల్వన్ రెండేసి వికెట్లు తీసారు. సెంచరీతో చెలరేగిన విక్రాంత్ సంతోష్ ఒక వికెట్ కూడా తీసాడు. విక్రాంత్ సంతోష్ సెంచరీ మ్యాచ్ మూమెంటమ్‌ను చెన్నై వైపు తిప్పింది. అనంతరం ముంబై పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోయింది.

ఈ టోర్నీలో టాలీవుడ్‌కు చెందిన తెలుగు వారియర్స్ తీవ్రంగా నిరాశపర్చింది. 3 మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క మ్యాచ్‌లో గెలిచి పాయింట్స్ టేబుల్‌లో ఆరో స్థానంలో నిలిచింది. తెలుగు వారియర్స్.. అక్కినేని అఖిల్ సారథ్యం వహించగా.. పంజాబ్ జట్టుపై మాత్రమే గెలుపొందింది. భోజ్‌పురి, కర్ణాటక జట్ల చేతిలో చిత్తుగా ఓడింది. మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచిన కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్ టాప్-2లో నిలవగా.. కేరళ స్ట్రైకర్స్ 2 గెలిచి మూడో స్థానంలో నిలిచింది. చెన్నై కింగ్స్ ఒక్క మ్యాచే గెలిచినప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
హైదరాబాద్, ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో నాకౌట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
జనవరి 31
సెమీఫైనల్ 1: కర్ణాటక బుల్డోజర్స్ vs వెల్స్ చెన్నై కింగ్స్ (మధ్యాహ్నం 2 గంటలకు)
సెమీఫైనల్ 2: బెంగాల్ టైగర్స్ vs కేరళ స్ట్రైకర్స్ (సాయంత్రం 6:30 గంటలకు)
ఫిబ్రవరి 1
ఫైనల్: TBA vs TBA (సాయంత్రం 6.30 గంటలకు)