For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Catch of the summer: ఓరి దేవుడో.. చరిత్రలో నిలిచే క్యాచ్! చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే! (వీడియో)

 Catch of the summer: Hilton Cartwright takes blinder in Marsh Cup final to send back Moises Henriques

సిడ్నీ: ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీ మార్ష్ కప్‌లో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఈ టోర్నీ ఫైనల్లో కళ్లు చెదిరే క్యాచ్‌తో ఓ ఫీల్డర్ ఔరా అనిపించాడు. బౌండరీ లైన్ వద్ద ఫుల్ లెంగ్త్ డైవ్‌తో అతను పట్టిన క్యాచ్ ప్రేక్షకులను నోరెళ్ల బెట్టేలా చేస్తుంది. క్యాచ్ ఆఫ్ ది సెంచరీగా చరిత్రకెక్కింది. న్యూ సౌత్ వేల్స్‌తో శుక్రవారం జరిగిన మార్ష్‌కప్‌ ఫైనల్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 18 పరుగులతో తేడాతో గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఫీల్డర్‌ హిల్టన్ కార్ట్‌రైట్ పట్టిన ఓ క్యాచ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. క్యాచ్ ఆఫ్ ది సమ్మర్‌గా నిలిచిపోయింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక ట్విటర్‌లో షేర్ చేయగా.. వైరల్ అయింది.

న్యూ సౌత్ వేల్స్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా డిఆర్సీ షార్ట్ వేసిన 45వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఫస్ట్ బాల్‌ను న్యూ సౌత్ వేల్స్ బ్యాటర్ మోయిసెస్ హెన్రీక్స్ స్టెప్ ఔటై లాంగ్‌ ఆన్‌ దిశగా భారీ షాట్‌ ఆడాడు. అతను ఆడిన షాట్‌ను చూసి అంతా బౌండరీ ఖాయమనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ హిల్టన్ కార్ట్‌రైట్ స్టన్నింగ్ క్యాచ్‌తో అందరి అంచనాలను తలకిందులు చేశాడు. ఏమాత్రం సాధ్యం కానీ క్యాచ్‌ను సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. అచ్చం చేప పిల్లలా గాల్లో డైవ్ చేస్తూ బౌండరీలైన్‌కు ఇంచ్ తేడాలో అందుకున్నాడు. దాంతో ఊపు మీదున్న హెన్రీక్స్ నిరాశగా పెవిలియన్ చేరగా.. మైదానంలో ఇతర ఆటగాళ్లంతా అవాక్కయ్యారు. ఇదెక్కడి క్యాచ్ రా అయ్యా అంటూ కార్ట్‌రైట్‌ను చూస్తు నిర్ఘాంతపోయారు. ఈ సూపర్ క్యాచ్ మ్యాచ్‌నే ములుపు తిప్పింది.

ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టులో బెన్‌క్రాప్ట్‌(39), జో రిచర్డ్‌సన్(44) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక 226 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ సౌత్ వేల్స్‌ 46.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. న్యూ సౌత్ వేల్స్‌ బ్యాటర్లలో హెన్రిక్స్(43), డానియల్‌ సామ్స్‌(42) పరుగులతో టాప్‌ స్కోరర్‌లుగా నిలిచారు. హెన్రీక్స్ ఔటవ్వడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అయింది.

Story first published: Friday, March 11, 2022, 17:12 [IST]
Other articles published on Mar 11, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+