Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

DC vs SRH: క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్.. మ్యాచ్‌ టర్నింగ్ పాయింట్!

ఢిల్లీ క్యాపిటల్స్ యువ ప్లేయర్ జేక్ ఫ్రెజర్-మెక్‌గర్క్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జేక్ ఫ్రెజర్ బౌండరీ లైన్‌పై సూపర్ మ్యాన్ క్యాచ్ అందుకున్నాడు. అతని అసాధారణ ఫీల్డింగ్‌కు సిక్సర్ వెళ్లాల్సిన బంతి వికెట్‌గా మారింది.

అతని సూపర్ ఫీల్డింగ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ యంగ్ సెన్సేషన్ అనికేత్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74) నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్ అని కొనియాడుతున్నారు.

Catch of IPL 2025 Jake Fraser-McGurk takes spectacular catch to dismisses Aniket Verma in DC vs SRH

ఈ క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందని అభిప్రాయపడుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కుల్దీప్ యాదవ్ వేసిన ఈ ఓవర్ నాలుగో బంతిని అనికేత్ వర్మ.. భారీ సిక్సర్‌గా తరలించాడు. ఆ మరుసటి బంతిని మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. దాదాపు బంతి సిక్సర్‌గా దూసుకెళ్లగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్.. సూపర్ మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు.

దాంతో అనికేత్ వర్మ వెనుదిరిగాల్సి వచ్చింది. అక్కడ జేక్ ఫ్రెజర్ మెక్ గర్క్ లేకున్నా.. ఈ క్యాచ్ పట్టకపోయినా.. పరిస్థితి మరోలా ఉండేది. అనికేత్ వర్మ ఆఖరి వరకు క్రీజులో ఉండి ఉంటే సన్‌రైజర్స్ 190 ప్లస్ రన్స్ చేసేది. అప్పుడు మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు కుప్పకూలింది. అనికేత్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74), హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(5/35) ఐదు వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్(3/22) మూడు వికెట్లు పడగొట్టాడు. మోహిత్ శర్మ(1) ఓ వికెట్ దక్కింది.

Story first published: Sunday, March 30, 2025, 18:33 [IST]
Other articles published on Mar 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+