India W vs England W: ప్చ్.. మిథాలీ మెరిసినా.. తప్పని ఓటమి!

బ్రిస్టల్: ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌ను డ్రా చేసుకున్న భారత్ మహిళల జట్టు వన్డే సిరీస్‌ను ఓటమితో ప్రారంభించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (108 బంతుల్లో 7ఫోర్లతో 72) హాఫ్ సెంచరీతో సత్తా చాటినా ఫలితం లేకుండా పోయింది. మిథాలీ మెరిసినా మిగతా బ్యాటర్స్ విఫలమవడం.. చిన్న టార్గెట్‌ను కాపాడుకోవడంలో బౌలర్లు కూడా తేలిపోయారు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులే చేయగలిగింది. చేదనలో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' టామీ బీమాంట్ (87 నాటౌట్), నాట్ సీవర్ (74 నాటౌట్) ధాటిగా ఆడటంతో ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి(1/25), ఏక్తా బిష్త్(1/55) చెరో వికెట్ తీశారు.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలో ఏదీ కలిసి రాలేదు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (10)తో పాటు అరంగేట్ర క్రికెటర్ షెఫాలి వర్మ (15) కూడా విఫలమవడంతో భారత ఇన్నింగ్స్ పేలవంగా ఆరంభమైంది. అయితే పూనమ్ రౌత్(32)తో కలిసి మిథాలీ థర్డ్ వికెట్‌కు 56 రన్స్ జోడించి ఇన్నింగ్స్ గాడిలో పెట్టింది. పూనమ్‌తో పాటు హర్మన్‌ప్రీత్(1) వెంట వెంటనే ఔటైనా.. దీప్తి శర్మ(30)తో రాజ్ కీలకమైన 65 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌ను పటిష్టం చేసింది. కానీ, ఇంగ్లీష్ టీమ్ బౌలర్లు మెరుగ్గా బౌలింగ్ చేయడంతో పాటు లోయర్ ఆర్చర్ బ్యాటర్స్ నిరశపరిచారు.
సంక్షిప్త స్కోర్లు:
భారత మహిళలు: 50 ఓవర్లలో 201/8 (మిథాలీ 72, పూనమ్ రౌత్ 32, దీప్తి శర్మ 30, ఎకిల్ స్టోన్ 3/40, శ్రుభ్ సోల్ 2/33, బ్రంట్ 2/35)
ఇంగ్లండ్ మహిళలు: 34.5 ఓవర్లలో 202/2 (బ్యూమోంట్ 87 నాటౌట్, సివర్ 74 నాటౌట్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications