Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా భర్తపై ఎందుకింత వివక్ష.. క్రికెట్ ఆస్ట్రేలియాపై డేవిడ్ వార్నర్ సతీమణి ఫైర్!

Candice Warner Slams CA Over Captaincy Ban On Her Husband David Warner After Sandpapergate Scandal

సిడ్నీ: క్రికెట్ ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ సతీమణి, క్యాండిస్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన భర్త పట్ల వివక్ష ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించింది. తన భర్త ఏం పాపం చేశాడని పక్షపాత ధోరణిని చూపిస్తున్నారని, ఇది అన్యాయమని సీఏపై విరుచుకుపడింది. డేవిడ్ వార్నర్‌పై ఉన్న లీడర్‌షిప్ బ్యాన్‌ను వెంటనే ఎత్తేయాలని ఆమె డిమాండ్ చేసింది.

ఇక బాల్ టాంపరింగ్ ఉదంతంలో దోషిగా తేలిన అప్పటి వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కెప్టెన్ స్టీవ్ స్మిత్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దాంతో పాటు ఈ ఇద్దరు మళ్లీ సారథ్యం వహించకుండా జీవితకాలపు నిషేధం విధించింది.

2018 సౌతాఫ్రికా పర్యటనలో ఎలాగైనా గెలవాలనే తపనతో ఈ ఇద్దరు యువ ప్లేయర్ బాన్‌క్రాఫ్ట్ సాయంతో బాల్ టాంపరింగ్‌కు యత్రించారు. అప్పట్లో ఈ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ఇటీవల స్టీవ్ స్మిత్‌పై ఉన్న కెప్టెన్సీ బ్యాన్‌ను ఎత్తేసిన సీఏ.. వార్నర్‌పై మాత్రం అలానే ఉంచింది. దాంతో యాషెస్ సిరీస్ సందర్భంగా ప్యాట్ కమిన్స్‌ను టెస్ట్ కెప్టెన్‌గా ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది.

దాంతో చిర్రెత్తుకుపోయిన క్యాండీస్ వార్నర్ తన భర్తకు చేస్తున్నా అన్యాయాన్ని నిలదీసింది. ట్రిపుల్ ఎమ్ అనే ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సీఏ పక్షపాత ధోరణిపై విరుచుకుపడింది. 'నాకు తెలిసి డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా ఉన్న 10 మ్యాచుల్లో ఒక్కటే ఓడాడు. కానీ అతని కెప్టెన్సీ నుంచి దూరం చేశారు. అన్యాయంగా అతన్ని సారథ్యాని దూరం చేశారు. పక్షపాత ధోరణితో నా భర్త పట్ల వివక్ష చూపుతున్నారు. వార్నర్ యూఏఈలో సారథ్యం వహించాడు. ఐపీఎల్‌లో గొప్ప సారథిగా ఓ వెలుగు వెలిగాడు. అక్కడ ప్రజలు వార్నర్‌ను వాళ్ల సొంతవాడిలా అభిమానిస్తున్నారు. నా భర్త పనితీరు గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు..అతనికి ఉన్న మద్దతు గురించి చెబుతున్నాను' అని పేర్కొంది.

2018 లో వార్నర్ పై నిషేధం వేసినప్పుడు తనకు బోర్డు నుంచి ఇతరుల నుంచి కావాల్సిన మద్దతు అందలేదని క్యాండీస్ వాపోయింది. ఇదిలాఉండగా.. వార్నర్ పై ఉన్న లైఫ్ టైమ్ కెప్టెన్సీ బ్యాన్ ను పున: పరిశీలించాలని సీఏ భావిస్తున్నది. ఇందుకు సంబంధించి సీఏ చర్చిస్తున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.

Story first published: Tuesday, July 5, 2022, 15:00 [IST]
Other articles published on Jul 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+