Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘మూడ్ వస్తే మ్యాచ్‌కు ముందు కూడా చేస్తాడు’.. క్యాండిస్ వార్నర్ బోల్డ్ కామెంట్స్! (వీడియో)

ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాస్త విరామం దొరికినా కుటుంబంతోనే గడిపేస్తాడు. ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా తన సతీమణి, కూతుళ్లతో ఆస్వాదిస్తాడు. సోషల్ మీడియా వేదికగా ఫ్యామిలీతో కలిసి రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు.

2015లో క్యాండిస్‌ను వివాహం చేసుకున్న వార్నర్.. ఆమెపై తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా వేదికగా చాటుకుంటాడు. అటు క్యాండిస్ కూడా వార్నర్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంటుంది. గతంలో ఓ రేడియో షోలో క్యాండిస్ వార్నర్ తన లైంగిక జీవితంపై చేసిన బోల్డ్ కామెంట్స్ వైరల్‌గా మారాయి.

Candice Warner opens up on her romantic life with husband David Warner and admits he goes good

పాకిస్థాన్‌తో జనవరి 3(బుధవారం) నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్ట్‌తో డేవిడ్ వార్నర్ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. ఈ క్రమంలోనే వార్నర్‌పై క్యాండిస్‌కు ఉన్న ప్రేమను తెలియజేసేలా అతని అభిమానులు.. ఆమె చేసిన బోల్డ్ కామెంట్స్‌ను వైరల్ చేస్తున్నారు. మూడేళ్ల క్రితం 2020లో 'ది కైల్ అండ్ జాకీ ఓ' షో‌లో పాల్గొన్న ఆమెను హోస్ట్ కిస్ కైల్.. లైంగిక జీవితంపై బోల్డ్ ప్రశ్నలు అడిగాడు.

వార్నర్‌కు మూడ్ వస్తే చేస్తాడు: 'ఫుట్ బాల్ ప్లేయర్లు మ్యాచ్‌కు ముందు సెక్స్ చేయరు. క్రికెటర్లు కూడా ఈ నిబంధనను పాటిస్తారా? డేవిడ్ వార్నర్ తన మ్యాచ్‌కు ముందు సెక్స్ చేస్తాడా?'అని ప్రశ్నించాడు. దీనికి క్యాండిస్ అది డేవిడ్ వార్నర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. అతనికి మూడ్ వస్తే చేస్తాడని, లేకుంటే లేదని బదులిచ్చింది. అంతేకానీ చేయకుండా ఉండవద్దనే రూల్‌తో అయితే ఏమి ఉండడని స్పష్టం చేసింది.

Candice Warner opens up on her romantic life with husband David Warner and admits he goes good

వార్నర్ కోరింది చేస్తాను: ఈ విషయంలో తన భర్త చాలా సమర్థుడని కూడా క్యాండిస్ బోల్డ్ కామెంట్స్ చేసింది. మ్యాచ్‌కు ముందు సెక్స్ చేయడానికి వార్నర్ సిద్దమైతే ఏం చేస్తారని హోస్ట్ ప్రశ్నించగా.. అతనికి సహకరిస్తానని క్యాండిస్ తెలిపింది. ఈ సమాధానం విన్న హోస్ట్ కైల్.. క్యాండిస్‌ను ప్రశంసించాడు. 'ఎంత మంచి మహిళవో.. అందుకే మీ బంధం గట్టిగా ఉంది'అని కొనియాడాడు.

చిచ్చర పిడుగులు: ఇక క్యాండిస్ కూడా రిలేషన్ షిప్ అంటేనే ఇచ్చుపుచ్చుకోవడం, ఒకరికొకరం అండగా ఉండటమని తెలిపింది. ఇక డేవిడ్ వార్నర్, క్యాండిస్ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇవి(9ఏళ్లు), ఇండి(7 ఏళ్లు), ఇస్లా(5 ఏళ్లు) ముగ్గురు అమ్మాయిలే. ప్రస్తుతం వార్నర్ కూతుళ్లు తండ్రిలానే సోషల్ మీడియా వేదికగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు.

పాకిస్థాన్‌తో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఇవి వార్నర్, ఇండి వార్నర్.. టీవీ హోస్ట్‌లుగా అవతారమెత్తారు. తన తండ్రితో పాటు ఆసీస్ క్రికెటర్లను ఇంటర్వ్యూ చేశారు. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిని కూడా ఇంటర్వ్యూ చేసి ఆకట్టుకున్నారు.

Story first published: Sunday, December 31, 2023, 10:11 [IST]
Other articles published on Dec 31, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+