Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: కెనడా సంచలన విజయం!

టీ20 ప్రపంచకప్ 2024లో కెనడా ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కెనడా.. 12 పరుగులు తేడాతో గెలుపొందింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే కెనడాకు ఇది తొలి విజయం. ఈ గెలుపుతో కెనడా పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానానికి దూసుకొచ్చింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 137 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో నికోలస్ కిర్టన్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. శ్రేయస్ మొవ్వ(36 బంతుల్లో 3 ఫోర్లతో 37) కీలక ఇన్నింగ్స్ ఆడారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫమయ్యారు.

Canada shock Ireland to secure first-ever T20 World Cup win

ఐర్లాండ్ బౌలర్లలో క్రైగ్ యంగ్, బ్యారీ మెక్‌కార్తీ రెండేసి వికెట్లు తీయగా.. మార్క్ అడైర్, గారెత్ డెలానీ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 పరుగులు చేసి ఓటమిపాలైంది. జియోర్జ్ డాక్‌రెల్(22 బంతుల్లో 29 నాటౌట్), మార్క్ అడైర్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించారు.

కెనడా బౌలర్లలో డిలాన్ హేలైర్(2/18), జెర్మీ గోర్డాన్(2/16) రెండేసి వికెట్లు తీయగా.. జునైద్ సిద్దికీ, సాద్ బిన్ జఫర్ తలో వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్‌లో ఐర్లాండ్ విజయానికి 17 పరుగులు అవసరమవ్వగా.. జెర్మీ గోర్డాన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సంచలన విజయాన్నందించాడు. రెండో బంతికే మార్క్ అడైర్‌ను క్యాచ్ ఔట్ చేసిన జెర్మీ గోర్డాన్.. తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క బౌండరీ ఇవ్వకుండా నాలుగు పరుగులే ఇచ్చాడు.

Story first published: Friday, June 7, 2024, 23:42 [IST]
Other articles published on Jun 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+