For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Gautham Gambhir: కేకేఆర్‌ మెంటార్‌గా ఉంటూ టీమిండియా హెడ్ కోచ్‌గా పనిచేయవచ్చా?

టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం పూర్తయినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ 2024 ముగిసిన వెంటనే గౌతమ్ గంభీర్ నియామకానికి సంబంధించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేస్తుందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.

ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. హెడ్ కోచ్‌గా కొనసాగేందుకు రాహుల్ ద్రవిడ్ సుముఖంగా లేకపోవడంతో గత 'మే'లోనే బీసీసీఐ కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను మొదలుపెట్టింది.

Can Gautam Gambhir Coach Team India And KKR Together

ఇప్పటికే హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుల గడవు ముగిసి నెల రోజులు అవుతున్నా.. హెడ్ కోచ్ నియామకంపై మాత్రం బీసీసీఐ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. మరోవైపు సుదీర్ఘ కాలం తర్వాత ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌‌ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్.. 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఛాంపియన్‌గా నిలబెట్టాడు.

మెంటార్‌గా గంభీర్ సక్సెస్ కావడంతో టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం బీసీసీఐ గంభీర్‌ను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. అతను కూడా కొన్ని కండీషన్స్‌తో టీమిండియా హెడ్ కోచ్ పదవిని స్వీకరించేందుకు సిద్దమయ్యాడని వార్తలు వస్తున్నాయి. మరోవైపు గంభీర్ సైతం టీమిండియా హెడ్ కోచ్ పదవికి మించిన గొప్ప బాధ్యత లేదని చెప్పాడు.

అలానే కేకేఆర్ మెంటార్‌గా కొనసాగాలని ఉందని కూడా చెప్పాడు. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా కేకేఆర్‌ను నిలబెట్టడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే గౌతమ్ గంభీర్ కేకేఆర్ మెంటార్‌గా కొనసాగుతూ.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా కొనసాగవచ్చా? అనే సందేహం చాలా మంది అభిమానులకు కలుగుతోంది.

అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్ట్ స్టాఫ్‌ బాధ్యతల్లో ఉన్నవారు మరే జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టవద్దు. ఐపీఎల్ ఆరంభంలో కోచ్‌లకు ఈ వెసులు బాటు ఉండేది. కానీ 2017లో బీసీసీఐ రూల్స్‌ను మార్చేసింది. 'పరస్పర విరుద్ద ప్రయోజనాల'అంశం నేపథ్యంలో బీసీసీఐ ఈ రూల్ తీసుకొచ్చింది.

ఈ వ్యవహారంతోనే 2017లో రాహుల్ ద్రవిడ్ ఢిల్లీ డేర్ డేవిల్స్(ఢిల్లీ క్యాపిటల్స్) జట్టు మెంటార్ పదవిని వదిలేసాడు. ఆ సమయంలో రాహుల్ ద్రవిడ్ నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా ఉండటంతో పాటు భారత్-ఏ, అండర్ 19 జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు.

అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం కావడంతో పాటు రాహుల్ ద్రవిడ్‌తో పాటు చాలా మంది కోచ్‌లు ఐపీఎల్‌లో తమ బాధ్యతలను వదులుకున్నారు. టీమిండియా హెడ్ కోచ్‌గా పని చేసే సమయంలో రవిశాస్త్రి కూడా ఐపీఎల్ కామెంట్రీకి దూరంగా ఉన్నాడు.

Story first published: Sunday, June 16, 2024, 19:36 [IST]
Other articles published on Jun 16, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+