Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: వరుసగా 4 ఓటములు.. సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరుతుందా?

ఐపీఎల్ 2025 సీజన్‌ను విజయంతో ఘనంగా ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. మరో గెలుపు కోసం నిరీక్షిస్తూనే ఉంది. ఆ జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది. పంజాబ్ కింగ్స్‌తో మంగళవారం జరిగిన హైస్కోర్ గేమ్‌లో చెన్నై 18 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ప్రియాంశ్ ఆర్య(103) మెరుపు శతకంతో 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం సీఎస్‌కే 201 పరుగులే చేసి ఓటమిపాలైంది. డెవాన్ కాన్వే(69) హాఫ్ సెంచరీతో రాణించినా.. మూడు సిక్స్‌లతో ధోనీ(27) దూకుడుగా ఆడినా ఫలితం దక్కలేదు. దూకుడైన అప్రోచ్ లేకపోవడం చెన్నై సూపర్ కింగ్స్ కొంపముంచింది.

వరుసగా 4 ఓటములు..
భారీ అంచనాలతో బరిలోకి దిగిన సీఎస్‌కే అనూహ్యంగా వరుస పరాజయాలతో చతికిలపడింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించి విజయం సాధించిన చెన్నై.. ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌తో పాటు పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. బ్యాటింగ్ విభాగం బలహీనంగా ఉండటం.. మిడిలార్డర్‌లో పవర్ హిట్టర్ లేకపోవడం.. చెత్త ఫీల్డింగ్.. బౌలింగ్ విభాగం నూర్ అహ్మద్‌పైనే ఆధారపడి ఉండటం చెన్నై విజయవకాశాలను దెబ్బతీస్తున్నాయి. ప్రస్తుత ఆటను చూస్తుంటే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరుతుందా? అనే సందేహం కలుగుతోంది. వరుసగా నాలుగు పరాజయాలతో చెన్నై పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో కొనసాగుతోంది.

Can CSK Still Qualify for IPL 2025 Playoffs After Fourth Consecutive Defeat

ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
ప్రస్తుత పరిస్థితుల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే తమ ఆట తీరును మెరుగుపరుచుకోవాలి. లీగ్ దశలో సీఎస్‌కే ఇంకా 9 మ్యాచ్‌లే ఆడుతోంది. ఈ 9 మ్యాచ్‌ల్లో 8 గెలిస్తేనే ఏ జట్టుతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరుతోంది. మరో రెండు మ్యాచ్‌లు ఓడి.. ఏడు గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. మరో 3-4 మ్యాచ్‌లు ఓడితే మాత్రం అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ పుంజుకుంటుందా? ప్లే ఆఫ్స్ చేరకుండా టోర్నీ నిష్క్రమిస్తుందా? కామెంట్ చేయండి.

Story first published: Wednesday, April 9, 2025, 15:32 [IST]
Other articles published on Apr 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+