Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన కామెరూన్ గ్రీన్..!

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో సౌతాఫ్రికా‌పై అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో కామెరూన్ గ్రీన్ 47 బంతుల్లోనే శతకం సాధించాడు. దాంతో మాథ్యూ హెడెన్ పేరిట ఉన్న 19 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టాడు. 2006లో సెయింట్ కిట్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అప్పటి ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హెడెన్ 66 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇప్పటి వరకు ఇదే సౌతాఫ్రికాపై ఇదే ఫాస్టెస్ట్ వన్డే సెంచరీ కాగా.. తాజాగా కామెరూన్ గ్రీన్ అధిగమించాడు. ఈ జాబితాలో కామెరూన్ గ్రీన్, మాథ్యూ హెడెన్ తర్వాత యూసఫ్ పఠాన్(68 బంతుల్లో), అబ్దుల్ రజాక్(70 బంతుల్లో), రికీ పాంటింగ్(71 బంతుల్లో) ఉన్నారు.

ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత వేగంగా వన్డే సెంచరీ సాధించిన బ్యాటర్‌గా కూడా కామెరూన్ గ్రీన్ నిలిచాడు. ఈ క్రమంలో అతను గ్లేన్ మ్యాక్స్‌వెల్(51 బంతుల్లో), ఏబీ డివిలియర్స్(52 బంతుల్లో)‌లను అధిగమించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్ 40 బంతుల్లోనే శతకంతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో నెదర్లాండ్స్‌పై మ్యాక్స్‌వెల్ ఈ ఫీట్ సాధించాడు.

Cameron Green Breaks Matthew Hayden s Record Hits Fastest ODI Century Against South Africa

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 276 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లకు 431 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్(103 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లతో 142), మిచెల్ మార్ష్(106 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100), కామెరూన్ గ్రీన్(55 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 118 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగారు. అలెక్స్ క్యారీ(37 బంతుల్లో 7 ఫోర్లతో 50 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, సీనరన్ ముత్తుసామీ తలో వికెట్ తీసారు.

అనంతరం సౌతాఫ్రికా 24.5 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. డెవాల్డ్ బ్రెవిస్(28 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 49) ఒక్కడే ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో గ్జేవియర్ బార్ట్‌లెట్(2/45), సీన్ అబాట్(2/27) రెండేసి వికెట్లు తీయగా.. కూపర్ కన్నోల్లీ(5/22) ఐదు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Sunday, August 24, 2025, 16:19 [IST]
Other articles published on Aug 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+