Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై మాటమార్చిన బెన్‌క్రాఫ్ట్.. మీడియాపై మండిపడ్డ ఆసీస్ బౌలర్లు!

Cameron Bancroft says no new information to offer in ball-tampering scandal
Ball-Tampering రచ్చ.. మాట మార్చిన Bancroft, Australia's Bowlers Statement || Oneindia Telugu

సిడ్నీ: 2018లో జరిగిన బాల్‌ ట్యాంపరింగ్ ఉదంతం గురించి తమ బౌలర్లకు ముందే తెలుసంటూ ఇటీవల బాంబు పేల్చిన ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ మాట మార్చాడు. సాండ్ పేపర్ గేట్ ఘటన గురించి తన వద్ద కొత్త సమాచారం ఏం లేదని క్రికెట్ ఆస్ట్రేలియాకు చెప్పాడు. న్యూల్యాండ్స్ వేదికగా 2018లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌లో బాల్ ట్యాంపరింగ్ పాల్పడి బెన్‌క్రాఫ్ట్ టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో బెన్‌క్రాఫ్ట్‌తో పాటు అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను సీఏ జట్టు నుంచి తప్పించింది. బెన్‌క్రాఫ్ట్‌పై 9 నెలలు, స్మిత్, వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించింది.

 సర్వత్రా విమర్శలు..

సర్వత్రా విమర్శలు..

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో న్యూల్యాండ్స్ ఘటన గురించి మాట్లాడిన బెన్‌క్రాఫ్ట్.. అప్పుడు టీమ్‌లో ఉన్న బౌలర్లకు ట్యాంపరింగ్ గురించి తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతని కామెంట్స్ ఆస్ట్రేలియా క్రికెట్‌లో కలకలం రేపాయి. దాంతో ఈ ఉదంతంపై పై సమగ్ర విచారణ జరిపించడంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, డేవిడ్​ వార్నర్​ మేనేజర్​ జేమ్స్​ ఎర్​స్కైన్ కూడా ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా సరైన రీతిలో దర్యాప్తు చేపట్టలేదని విమర్శించారు​. ఆటగాళ్లందరినీ విచారించకుండా ఆసీస్​ బోర్డు ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు.

 బెన్‌క్రాఫ్ట్ యూటర్న్..

బెన్‌క్రాఫ్ట్ యూటర్న్..

దాంతో ఈ ఘటనపై రీఇన్వెస్టిగేషన్‌కు తాము సిద్దమంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. కానీ, ఆసీస్ మీడియా కథనాల ప్రకారం బెన్‌క్రాఫ్ట్ ఈ విషయంలో చెతులెత్తేశాడని తెలుస్తోంది.

తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని తనను సంప్రదించిన సీఏ ఇంటిగ్రిటీ యూనిట్‌కు వివరణ ఇచ్చాడని సమాచారం. దీంతో సాండ్ పేపర్ గేట్‌పై రేగిన చిచ్చు చల్లారింది. కాగా, తన కామెంట్స్‌తో చిక్కుల్లో పడిన తమ టీమ్ బౌలర్లు కమిన్స్, హాజిల్ వుడ్, నాథన్ లయన్, స్టార్క్‌కు కూడా బెన్‌క్రాఫ్ట్ వివరణ ఇచ్చుకున్నాడు.

చిరాకుతో చెప్పిన సమాధానం..

చిరాకుతో చెప్పిన సమాధానం..

దీనిపై బౌలర్లంతా ఉమ్మడిగా ఓ ప్రకటన విడుదల చేశారు. సాండ్ పేపర్ గేట్ గురించి ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్నలు ఎదురవ్వడంతో చిరాకుతో ఏదో సమాధానం చెప్పానని బెన్‌క్రాఫ్ట్ మాకు చెప్పాడని, కావాలని ఆ కామెంట్స్ చెయ్యలేదన్నాడు. న్యూలాండ్స్ టెస్ట్‌లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ గురించి మాకు ముందుగా ఏమీ తెలియదనే విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తున్నామని బౌలర్లు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. 'మా నిజాయితీ పట్ల మేము గర్వంగా ఉన్నాం. కానీ, ఇటీవల బాల్ ట్యాంపరింగ్ వివాదానికి సంబంధించి మమ్మల్ని తప్పుపట్టడం వల్ల కొంత బాధేసింది. మీడియాతో పాటు మాజీ ఆటగాళ్లు మమ్మల్ని ప్రశ్నించడం బాధాకరం. నాటి సంఘటనకు సంబంధించి ఏం జరిగిందో తెలియజేయాలని మాపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ, అప్పుడు మైదానంలో ఏం జరిగిందో మాకేమీ తెలీదు" అని పేర్కొన్నారు.

Story first published: Wednesday, May 19, 2021, 10:42 [IST]
Other articles published on May 19, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+