Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: ఇది క్రికెట్ కాదు.. రబడా సంచలన వ్యాఖ్యలు!

ఐపీఎల్ 2025 సీజన్ సాగుతున్న తీరుపై గుజరాత్ టైటాన్స్ పేసర్, సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ కగిసో రబడా అసహనం వ్యక్తం చేశాడు. బ్యాటర్లే పూర్తి ఆధిపత్యం చెలాయిస్తుండటంపై తనదైన శైలిలో మండిపడ్డాడు. అసలు ఇది క్రికెట్ అంటారా? అని ప్రశ్నించాడు. ఇది ఏ మాత్రం క్రికెట్ కాదని, ఈ ఆటను బ్యాటింగ్ అని పిలవాలని సెటైర్లు పేల్చాడు.

క్రికెట్‌లో బ్యాట్‌కు బంతికి మధ్య సమతూకం ఉంటేనే అసలు మజా లభిస్తోంది. లేకుంటే మ్యాచ్ వన్‌సైడ్‌గా ముగుస్తోంది. టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత బ్యాటర్లదే పూర్తి ఆధిపత్యం నడుస్తోంది. బౌలర్లకు అనుకూలంగా ఐసీసీ ఎన్ని నిబంధనలు తీసుకొచ్చినా.. అవి వర్కౌట్ అవ్వడం లేదు. ప్రేక్షకులు కూడా భీకర బ్యాటింగ్‌నే ఆస్వాదిస్తుండటంతో నిర్వాహకులు సైతం బ్యాటింగ్‌ పిచ్‌లనే సిద్దం చేస్తున్నారు.

Call our sport batting not cricket Kagiso Rabada not happy with high-scoring matches in IPL 2025

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు జరగ్గా.. నాలుగు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌లపై సునాయసంగా 250 ప్లస్ రన్స్ నమోదవుతున్నాయి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా బౌలర్ల పాలిట శాపంగా మారింది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లే నమోదయ్యాయి. దాంతో లీగ్ జరుగుతున్న తీరు.. బ్యాటర్ల ఆధిపత్యంపై రబడా అసహనం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో పిచ్‌లు పూర్తిగా ఫ్లాట్‌గా మారిపోతున్నాయి. ప్రతీ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయి. దాంతో ఆటలో అసలు సిసలు మజా మిస్సవుతోంది. ఇది క్రికెట్ కాదు.. ఈ ఆటను బ్యాటింగ్ అని పిలవచ్చు. హైస్కోరింగ్ గేమ్స్ వల్ల రికార్డులు బ్రేక్ అవుతాయి. కానీ లోస్కోరింగ్ మ్యాచ్‌లు వద్దా? బ్యాట్, బంతికి సమతూకం ఉండాలి. లేకుంటే ఆటలో ఉన్న అందం మిస్సవుతోంది.

ప్రతిసారి హైస్కోర్లు లేదా ప్రతిసారి లోస్కోర్ మ్యాచ్‌లు జరిగితే ప్రేక్షకులు కూడా బోర్ కొడుతోంది. బ్యాట్, బంతి మధ్య ఆసక్తికర పోరు ఉంటేనే మ్యాచ్ చూసేందుకు ఆసక్తి పెరుగుతోంది.'అని రబడా చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రబడా.. పంజాబ్ కింగ్స్‌తోజరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 11 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రబడా వ్యాఖ్యలపై ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. రబడాకు బాగా మండినట్లుందని కామెంట్ చేస్తున్నారు.

Story first published: Wednesday, March 26, 2025, 19:13 [IST]
Other articles published on Mar 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+