అయ్య బాబోయ్.. మాకొద్దీ బీసీసీఐ బాధ్యతలు!!

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అపెక్స్ కౌన్సిల్ నుంచి తమ ప్రతినిధిని తప్పించాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. బోర్డు, రాష్ట్ర సంఘాల్లో ఆర్థిక పారదర్శకత కోసం లోథా కమిటీ సిఫారసుల మేరకు అపెక్స్ కమిటీలో కాగ్ సభ్యుడిని కోర్టు నియమించింది. కాగ్ తరఫున అల్కా రెహాని భరద్వాజ్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడంలో స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నామని కాగ్.. ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది.

గంగూలీకి ప్రత్యేక విజ్ఞప్తి
ఈ నెల 17న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి 'అర్హులైన' వ్యక్తులు మాత్రమే హాజరయ్యేలా చూడాలని గత శనివారం అల్కా భరద్వాజ్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఆమె నేరుగా ఎవరి పేరూ చెప్పకపోయినా.. బోర్డు కార్యదర్శి జై షాను ఉద్దేశించే ఇలా చేసినట్లు తెలుస్తోంది.

మాకొద్దీ బీసీసీఐ బాధ్యతలు
కొత్త నియమావళి ప్రకారం బీసీసీఐ బోర్డులో గానీ, రాష్ట్ర సంఘంలో గానీ కలిపి వరుసగా ఆరేళ్లు ఆఫీస్ బేరర్‌గా పని చేసిన వ్యక్తులు తమ పదవుల్లో కొనసాగడానికి అనర్హులు. ఇలాంటి స్థితిలో బీసీసీఐలో భాగంగా ఉంటూ పని చేయలేమని 'కాగ్' సుప్రీంను అభ్యర్థించింది. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్‌లోని 9 మంది సభ్యుల్లో.. ఐదుగురు బీసీసీఐ ఆఫీసు బేరర్లు, క్రికెటర్ల సంఘం నుంచి ఇద్దరు, బీసీసీఐ జనరల్ బాడీ (రాష్ట్రాలు) నుంచి ఒకరు, ఒక కాగ్ నామినీ ఉంటారు.

జోహ్రి రాజీనామా ఆమోదం
మరోవైపు బీసీసీఐతో రాహుల్ జోహ్రి బంధం ముగిసింది. అతడి రాజీనామాను బోర్డు ఆమోదించింది. 2016లో బీసీసీఐ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా జోహ్రి బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు నియమించిన బోర్డు పాలకుల కమిటీ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బోర్డుకు పూర్తి అధికారాలు అప్పగించిన వెంటనే.. జోహ్రి తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ఆమోదించని బోర్డు.. 2021లో ఒప్పందం ముగిసేవరకు బాధ్యతల్లో కొనసాగాలని జోహ్రిని కోరింది. నిరుడు డిసెంబరు 27న మరోసారి అతడు రాజీనామా చేశాడు. చాలాకాలం పెండింగ్‌లో ఉన్న అతడి రాజీనామాను గురువారం బోర్డు ఆమోదించిందని బోర్డు అధికారి చెప్పారు.

నమ్మకం కోల్పోయిందని
రాహుల్ జోహ్రి పదవీ కాలం 2021 వరకు ఉండగా.. అప్పుడే ఆయన రాజీనామా చేయడం విశేషం. దీనికి బీసీసీఐ బోర్డు అధికారులు ఎలాంటి కారణం చూపలేదు. అయితే జోహ్రి ఇటీవల కావాలనే బోర్డు అంతర్గత ఇ-మెయిల్స్‌ను బయటపెట్టారని, బోర్డు ఆయనపై నమ్మకం కోల్పోయిందని తెలుస్తోంది.
ప్రభావం చూపలేకపోయిన ఇంగ్లండ్ బౌలర్లు.. వెస్టిండీస్ స్కోర్ 57/1
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications