న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సీఏఏ నిరసన సెగలు: భారత్-శ్రీలంక తొలి టీ20కి అసోం రెడీ!

 CAA protests: Assam ready for India-Sri Lanka T20I, buy tickets online

హైదరాబాద్: జనవరి 5న భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న తొలి టీ20 అసోంలో యథావిధిగా జరుగుతుందని అసోం క్రికెట్‌ అసోసియేషన్ గురువారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి ఆమోదం తెలపడంతో గత కొన్ని రోజులుగా అసోంలో పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకున్నాయి.

ఆందోళనకారులు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో అసోం వేదికగా జరగాల్సిన రంజీ, కూచ్‌బెహార్‌ టోర్నీల మ్యాచ్‌‌లను నిలిపివేయడంతో పాటు ఆటగాళ్లను హోటల్ గదులకే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో జనవరిలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే తొలి టీ20పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి.

పరుగు ఇవ్వని అంపైర్‌.. మైదానంలో రచ్చ చేసిన స్టీవ్‌ స్మిత్‌ (వీడియో)!!పరుగు ఇవ్వని అంపైర్‌.. మైదానంలో రచ్చ చేసిన స్టీవ్‌ స్మిత్‌ (వీడియో)!!

జనవరి 5న అసోంలో టీ20

జనవరి 5న అసోంలో టీ20

తొలి టీ20 నుంచి అసోం నుంచి వేరే వేదకకు మార్చాలంటూ బీసీసీఐకి విజ్ఞప్తులు కూడా వచ్చాయి. అయితే, ప్రస్తుతం అసోంలో పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉన్నాయని మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదని అసోం క్రికెట్‌ అసోసియేషన్ కార్యదర్శి దేబోజిత్‌ సైకియా వెల్లడించారు,.

పరిస్థితులు ప్రశాంతంగా

పరిస్థితులు ప్రశాంతంగా

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయి. అంతర్జాతీయ మ్యాచులకు ఎలాంటి రక్షణ కల్పిస్తారో ఈ మ్యాచుకీ అలాగే ఉంటుంది. తొలి టీ20 నిర్వహణకు మేం సిద్ధంగా ఉన్నామనిబీసీసీఐకి తెలియజేశాం. ఈ మ్యాచ్‌కి ఎలాంటి ఇబ్బందులు లేవు" అని అన్నారు.

బాక్సింగ్ డే టెస్టు: తొలిరోజు 80473 హాజరు, స్మిత్ హాఫ్ సెంచరీ, ఆస్ట్రేలియా 257/4

మ్యాచ్‌ యథావిధిగా

మ్యాచ్‌ యథావిధిగా

మరోవైపు బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "మేం పరిస్థితులను సునిశితంగా పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటికైతే అంతా సానుకూలంగానే ఉంది. మ్యాచ్‌ యథావిధిగా జరుగుతుంది" అని పేర్కొన్నారు. త్వరలోనే ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు మొదలవుతాయని ఆయన తెలిపారు.

భారత పర్యటనకు శ్రీలంక జట్టు

భారత పర్యటనకు శ్రీలంక జట్టు

మూడు టీ20ల సిరిస్ కోసం జనవరిలో శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానుంది. తొలి టీ20కి రెండు రోజుల ముందు ఇరు జట్లు గౌహతికి చేరుకుంటాయని అన్నారు. భారత పర్యటనలో భాగంగా శ్రీలంకతో జనవరి 5న తొలి టీ20 గౌహతి వేదికగా తలపడనుండగా ఆ తర్వాత 7న ఇండోర్‌, 10న పుణె వేదికగా జరగనున్నాయి.

లంకతో టీ20లకు టీమిండియా

లంకతో టీ20లకు టీమిండియా

విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, సంజు సామ్సన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివం దుబే, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జాడేజా , జస్‌ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్

Story first published: Thursday, December 26, 2019, 14:59 [IST]
Other articles published on Dec 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X