బాక్సింగ్ డే టెస్టు: తొలిరోజు 80473 హాజరు, స్మిత్ హాఫ్ సెంచరీ, ఆస్ట్రేలియా 257/4

హైదరాబాద్: మెల్ బోర్న్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న బాక్సింగ డే టెస్టులో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. 32 ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ బాక్సింగ్ డే టెస్టులో తొలిరోజు ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది.
తొలిరోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో స్టీవ్ స్మిత్(77), ట్రావిస్ హెడ్(25) పరుగులతో ఉన్నారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు ఆస్ట్రేలియాకు కివీస్ బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. జట్టు స్కోరు ఒక పరుగు వద్ద ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఓపెనర్ జో బర్న్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన లుబుషేన్‌తో కలిసి ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అయితే, డేవిడ్ వార్నర్ దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 61 పరుగుల వద్ద నీల్ వాగ్నెర్ బౌలింగ్‌లో టిమ్ సౌథీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి స్టీవ్ స్మిత్ వచ్చాడు.
లబుషేన్ హాఫ్ సెంచరీ
లుబుషేన్-స్టీవ్ స్మిత్‌ల జోడీ నిలకడగా ఆడుతూ ఆసీస్ స్కోరు బోర్డుని మరింత ముందుకు నడిపించారు. ఈ క్రమంలో లుబుషేన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో లబుషేన్‌కి ఇది ఆరోది కావడం విశేషం. హాఫ్ సెంచరీ తర్వాత జట్టు స్కోరు 144 పరుగుల వద్ద లబుషేన్(63) గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
స్టీవ్ స్మిత్ పరుగుల వరద
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మాథ్యూ వేడ్‌తో కలిసి స్టీవ్ స్మిత్ పరుగుల వరద పారించాడు. హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు ఆస్ట్రేలియా తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో గ్రెగ్ చాపెల్(7110) రికార్డుని అధిగమించాడు. అంతేకాదు స్టీవ్ స్మిత్ టాప్-10 జాబితాలో చేరిపోయాడు.
ఆస్ట్రేలియా తరుపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు:
13,378 - RT Ponting
11,174 - AR Border
10,927 - SR Waugh
8643 - MJ Clarke
8625 - ML Hayden
8029 - ME Waugh
7696 - JL Langer
7525 - MA Taylor
7422 - DC Boon
7111 - SPD SMITH*
7110 - GS Chappell
టీ విరామానికి ఆస్ట్రేలియా 155/3
టీ విరామానికి 155/3తో నిలిచిన ఆస్ట్రేలియా ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడింది. వేడ్-స్మిత్‌లు యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, జట్టు స్కోరు 216 పరుగుల వద్ద మాథ్యూ వేడ్(38) గ్రాండ్ హోమ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వాట్లింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
తొలిరోజు మ్యాచ్‌కి 80,473 హాజరు
బాక్సింగ్ డే టెస్టు కావడంతో తొలి రోజు పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. తొలిరోజు మ్యాచ్‌కి 80,473 హాజరు కావడంతో ఎంసీసీలో సందడి వాతావరణం నెలకొంది. చివరగా ఈ రెండు జట్లు 1987లో బాక్సింగ్ డే (డిసెంబర్ 26) టెస్టులో తలపడ్డాయి. అప్పటికి ప్రస్తుత కివీస్ జట్టులోని నీల్ వాగ్నర్, రాస్ టేలర్, వాట్లింగ్, గ్రాండ్‌హోమ్ మాత్రమే జన్మించారు.
తొలి టెస్టులో ఓటమి
పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ఓటమి పాలైన కివీస్ ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ సమం చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఆతిథ్య ఆసీస్ ఈ మ్యాచ్‌లోనే విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలనే చూస్తోంది. కివీస్‌కు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) ఎప్పుడూ కలిసి రాలేదు. ఇక్కడ మూడు మ్యాచ్‌లాడిన న్యూజిలాండ్ రెండు ఓడి, ఒకదాంట్లో ‘డ్రా' చేసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications