Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ సంచలన వ్యాఖ్యలు.. బాల్​ ట్యాంపరింగ్​ ఉదంతంపై మరోసారి దర్యాప్తు!

CA reacts after Cameron Bancroft hints bowlers’ involvement in 2018 ball tampering saga

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన బాల్ ట్యాంపరింగ్(సాండ్ పేపర్ గేట్) వివాదం గురించి ఆ జట్టు ప్లేయర్ కామెరూన్ బ్యాన్‌క్రాఫ్ట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన విషయం.. ఇతర బౌలర్లకూ తెలుసని బాన్‌క్రాఫ్ట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దాంతో ఈ సాండ్ పేపర్ గేట్ వివాదంలో బాన్ క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నరే కాకుండా ఇతరుల పాత్ర కూడా ఉందా? అనే అనుమానాలు రేకెత్తాయి.

అయితే ​ బాన్​క్రాఫ్ట్ చేసిన వ్యాఖ్యలపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. ఇంకా ఈ వ్యవహారంలో ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే స్వయంగా ముందుకు రావాలని ప్రకటించింది. ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు గతంలోనే సమగ్రంగా జరిగిందని, అవసరమైతే మరోసారి దర్యాప్తు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని సీఏకు చెందిన ఓ అధికారి తెలిపారు.

సందేహాలుంటే రీ ఎంక్వైరీ..

సందేహాలుంటే రీ ఎంక్వైరీ..

'2018లో ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా​ మధ్య జరిగిన కేప్​టౌన్​ టెస్టులో.. బాల్​ ట్యాంపరింగ్​ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇందులో ఎవరి వద్ద అయినా కొత్త సమాచారం ఉంటే వెల్లడించాలి. ఇందుకు సంబంధించిన దర్యాప్తు గతంలోనే జరిగింది. అప్పటి నుంచి దీని గురించి ఎవరూ చర్చించలేదు. అయితే మా దర్యాప్తులో ఏమైనా సందేహాలు ఉంటే చెప్పొచ్చు. దోషులుగా తేలితే మిగతావారిని కూడా శిక్షిస్తాం'అని క్రికెట్ ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు.

స్మిత్, వార్నర్ ప్రోద్బలంతో..

స్మిత్, వార్నర్ ప్రోద్బలంతో..

2018లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వరుస ఓటములు భరించలేని ఆస్ట్రేలియా ఆటగాళ్లు చీటింగ్‌కు తెరలేపారు. ఆ క్రమంలోనే నాటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రొద్బలంతో బ్యాన్‌క్రాఫ్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడు. ఈ ఉదంతం క్రికెట్‌ ప్రపంచంలో పెను దుమారం లేపింది. ఈ ఘటన పట్ల కఠినంగా వ్యవహరించిన క్రికెట్ ఆస్ట్రేలియా.. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ, డేవిడ్ వార్నర్ వైస్ కెప్టెన్సీలను పీకేయడంతో పాటు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండా నిషేధించింది. ఇక యువ ఆటగాడైన బాన్ క్రాఫ్ట్ తొమ్మిది నెలల దూరమయ్యాడు.

 తెలియకుండా చేశా..

తెలియకుండా చేశా..

ప్రస్తుతం ఇంగ్లండ్‌లో కౌంటీలు ఆడుతున్న బ్యాన్‌క్రాఫ్ట్.. ఓ ఇంటర్వ్యూలో బాల్‌ టాంపరింగ్‌ ఉదంతం గురించి కొన్ని తెలియని విషయాలను బయటపెట్టాడు. 'బాల్‌ టాంపరింగ్‌ గురించి స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌తో పాటు ఇతర బౌలర్లకు కూడా తెలుసు. బౌలర్లకు సాయం చేసేందుకే నేను ఆ పని చేశాను. మా జట్టులో అందరిచేతా ప్రశంసలు పొందాలని, ముఖ్యమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవాలనే తాపత్రయం ఆ పని చేసేలా చేసింది.

ఉప్పుకాగితాన్ని బంతికి పూసి జట్టుకు ఉపయోగంగా మారాలనుకున్నా. అది జరిగాక కానీ నేను చేసింది తప్పని తెలుసుకోలేకపోయా.అప్పట్లో నాకు పెద్దగా అవగాహన లేదు. ట్యాంపరింగ్ విషయంలో మరింత నాలెడ్జ్ ఉండుంటే.. నా నిర్ణయం మరోలా ఉండేది.'అని బాన్ క్రాఫ్ట్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, May 16, 2021, 15:43 [IST]
Other articles published on May 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+