న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎప్పుడు జరిగినా ప్రేక్షకుల మధ్యే టీ20 ప్రపంచకప్!

CA Interim CEO Hockley Says Crowds Most Likely To Be Allowed At T20 World Cup In Australia

మెల్‌బోర్న్‌: కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది ఆఖర్లో జరగాల్సిన టీ20 ప్రపంచక్‌పపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ జరిగినా కూడా మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించే అదృష్టం ప్రేక్షకులకు దక్కుతుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం ఈ విషయంలో చాలా స్పష్టంగానే ఉంది.

టీ20 ప్రపంచకప్‌ నిర్వహణలో సొంత ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించడం తమకు సమస్య కాదని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తాత్కాలిక సీఈఓ నిక్‌ హాక్లీ అన్నారు. ఇటీవలే ఉద్వాసనకు గురైన కెవిన్‌ రాబర్ట్స్‌ స్థానంలో నిక్‌ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే టోర్నీలో పాల్గొనే 15 జట్లను దేశంలోకి వచ్చేలా చేసి వారికి ఆతిథ్య ఏర్పాట్లు చేయడమే పెద్ద సవాల్‌ అని ఆయన చెప్పారు. ప్రపంచకప్‌ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నా... ఎప్పుడు టోర్నీ జరిగితే అప్పుడు ప్రేక్షకులను మాత్రం అనుమతిస్తామని హాక్లీ స్పష్టం చేశారు.

'ఒక ద్వైపాక్షిక సిరీస్‌ను నిర్వహించడం అంటే ఇబ్బంది ఉండదు. కానీ 15 జట్ల ఆటగాళ్లు ముందు దేశంలోకి వచ్చేలా అనుమతులు తీసుకోవాలి. వారి సహాయక సిబ్బంది, అధికారులు కూడా అదనం. కనీసం ఒక నగరంలో ఆరేడు జట్లను ఉంచి అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం. దీంతో పోలిస్తే అభిమానులు మైదానంలో వచ్చి మ్యాచ్‌లు చూడేలా చేయడం మా దృష్టిలో చిన్న విషయం. కాబట్టి ఎప్పుడు ఈ మెగా ఈవెంట్‌ జరిగినా ప్రేక్షకులను అనుమతిస్తాం' అని సీఈఓ స్పష్టం చేశారు.

చాలాసార్లు చావాలనుకున్నా.. తెలుసుంటే సుశాంత్‌తో మాట్లాడేవాడిని : షమీచాలాసార్లు చావాలనుకున్నా.. తెలుసుంటే సుశాంత్‌తో మాట్లాడేవాడిని : షమీ

Story first published: Sunday, June 21, 2020, 10:56 [IST]
Other articles published on Jun 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X