బుమ్రా X మార్క్ వుడ్ మధ్య గొడవ.. రాకాసి బౌన్సర్లతో భారత పేసర్‌పై రివేంజ్!(వీడియో)

లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మంచి రసపట్టుగా సాగుతోంది. బ్యాట్, బాల్ పోరుకు ఆటగాళ్ల మాటల తూటాలు కూడా తోడవ్వడంతో లార్డ్స్ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా చివరి రోజు ఆట ఉత్కంఠగా సాగుతుంది. క్రీజులో ఉన్న టీమిండియా యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా, ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ మధ్య మైదానంలో వాగ్వాదం చోటు చేసుకుంది. భారత టెయిలెండర్లపై ఇంగ్లండ్ పేసర్లు రాకాసి బౌన్సర్లతో దాడికి దిగుతున్నారు.
ఈ క్రమంలో బుమ్రా హెల్మెట్‌కు ఓ బౌన్సర్ బలంగా తాకింది. కంకషన్ టెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వెంటనే మార్క్ వుడ్ ఏదో కామెంట్ చేయడంతో ఆగ్రహానికి గురైన బుమ్రా.. మాటలతో ఎదురు దాడి చేశాడు. దాంతో అంపైర్లు కలగజేసుకున్నారు. ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ సైతం బుమ్రా దగ్గరకు వచ్చి మాట్లాడటం టీవీ రిప్లేలో కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

పంత్ విఫలమైనా..
బుమ్రా, మహమ్మద్ షమీ టాపార్డర్ బ్యాట్స్‌మన్ తరహాలో బ్యాటింగ్ చేస్తూ భారత ఆధిక్యాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే లీడ్‌ను 200 ధాటించారు. అంతకుముందు 181/6 ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను కొనసాగించిన భారత్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఓటమి నుంచి జట్టును గట్టెక్కిస్తాడనుకున్న రిషభ్ పంత్(22) తీవ్రంగా నిరాశపరిచాడు.
బౌండరీతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన పంత్.. రాబిన్సన్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేయబోయి ఎక్స్‌ట్రా బౌన్స్ కారణంగా కీపర్ చేతికి చిక్కాడు. దాంతో భారత్ 194 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి మహమ్మద్ షమీ(4 బ్యాటింగ్) రాగా.. ఇషాంత్ శర్మ(12 బ్యాటింగ్) ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశాడు. రెండు బౌండరీలతో జోరు కనబర్చాడు. కానీ ఓలీ రాబిన్సన్ ఇషాంత్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. రివ్యూ తీసుకున్న ఫలితం లేకుండా పోయింది.
బుమ్రాపై రివేంజ్..
దాంతో క్రీజులోకి బుమ్రా రాగా.. ఇంగ్లండ్ వ్యూహం మార్చింది. షార్ట్ పిచ్ బంతులతో రివేంజ్ తీసుకునే ప్రయత్నం చేసింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా బుమ్రా సైతం షార్ట్ పిచ్ బంతులతో ఆ జట్టు టెయిలెండర్లను బెంబేలెత్తించాడు. ముఖ్యంగా జేమ్స్ అండర్సన్‌కు ప్రమాదకరంగా బంతులు విసిరాడు. బుమ్రా బౌన్సర్లను ఆడలేక జిమ్మీ శరీరానికి తగిలించుకున్నాడు.
పక్కటెముకలకు, నెత్తికి బంతి పలుమార్లు బలంగా తాకింది. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అండర్సన్ దగ్గరకు వెళ్లిన బుమ్రా నవ్వుతూ అతని భుజాన్ని తట్టాడు. దాంతో అండర్సన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. బుమ్రా నవ్వు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడు. జోరూట్ వారించడంతో జిమ్మీ వెనక్కుతగ్గాడు.

కొనసాగుతున్న మాటల యుద్దం..
అక్కడ మొదలైన మాటల యుద్దం.. ఆ తర్వాత భారత ఇన్నింగ్స్‌లో కూడా కొనసాగింది. కోహ్లీ, అండర్సన్ మధ్య కూడా మాటల యుద్దం నడిచింది. బ్యాడ్ లైట్ నేపథ్యంలో రిషభ్ పంత్ కూడా జోరూట్‌తో వాగ్వాదానికి దిగాడు. ఇక కీలకమైన చివరి రోజు మళ్లీ ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. కీలక బ్యాట్స్‌మన్ అంతా ఔటైనా.. భారత టెయిలండర్లు పట్టుదలతో బ్యాటింగ్ చేస్తుండటంతో ఇంగ్లండ్ బౌలర్లు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇప్పటికే బుమ్రా, షమీ 42 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు.

సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 364 ఆలౌట్;
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 391 ఆలౌట్
భారత్ సెకండ్ ఇన్నింగ్స్: 255/8( బుమ్రా(21 బ్యాటింగ్), షమీ(31 బ్యాటింగ్))
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications