Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీకి ఘోర అవమానం..!

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఘోర అవమానం జరిగింది. అతను చేసిన విజ్ఞప్తిని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్‌సీఏ) బేఖాతరు చేసింది. గతేడాది జరిగిన రంజీ ట్రోఫీలో తమిళనాడు జట్టు దారుణంగా విఫలమవడంతో టీఎన్‌సీఏ మళ్లీ బుచ్చిబాబు టోర్నీని తెరమీదకు తీసుకొచ్చింది.

2016-17 సీజన్‌లో చివరి సారిగా ఈ టోర్నీని నిర్వహించిన టీఎన్‌సీఏ మళ్లీ విండో కేటాయించలేదు. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీకి ప్రీ సీజన్‌గా ఈ టోర్నీని నిర్వహించేందుకు సిద్దమైంది. దేశవ్యాప్తంగా 12 జట్లు ఈ టోర్నీలో పాల్గొననుండగా.. నాలుగు రోజుల ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

Buchi Babu Tournament

టీఎన్‌సీఏ ప్రెసిడెంట్ ఎలెవన్‌తో పాటు ఇండియన్ ర్వైల్వేస్, త్రిపుర, హర్యానా, బరోడా, మధ్యప్రదేశ్, ముంబై, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, టీఎన్‌సీఏ ఎలెవన్, కేరళ, బెంగాల్ జట్లు బరిలోకి దిగనున్నాయి. అగస్టు 15 నుంచి సెప్టెంబర్ 18వరకు సెలెమ్, కొయంబత్తూరు, దిండిగల్, తిరునెల్వెలి నగరాల్లో ఈ టోర్నీ జరగనుంది. మొత్తం 12 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు.

అయితే ఈ టోర్నీలో జార్ఖండ్ టీమ్‌ను భాగం చేయాలని మహేంద్ర సింగ్ ధోనీ చేసిన స్పెషల్ రిక్వెస్ట్‌ను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ పట్టించుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పటికే 12 జట్లు పాల్గొంటుండటంతో ధోనీ రిక్వెస్ట్‌ను పరిగణలోకి తీసుకోలేకపోయామని టీఎన్‌సీఏ సెక్రటరీ పలాణి పేర్కొన్నారు.

'ఈ టోర్నీలో జార్ఖండ్ టీమ్‌ను భాగం చేయాలని ధోనీ కోరాడు. కానీ మేం అతని విన్నపాన్ని నేరవేర్చలేకపోయాం. ఇప్పటికే 12 జట్లతో టోర్నీ షెడ్యూల్ ఖారారు అయ్యింది. సర్వీసెస్ టీమ్‌తో పాటు చత్తీస్‌ఘడ్ కూడా ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఆసక్తి చూపించాయి. కానీ టైట్ షెడ్యూల్ కారణంగా ఆడించలేని పరిస్థితి. రంజీ సీజన్‌కు ముందు ఈ టోర్నీతో ప్లేయర్లకు మంచి ప్రాక్టీస్ లభించనుంది.'అని పలాణి తెలిపారు.

ధోనీ రిక్వెస్ట్‌ను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ పట్టించుకోకపోవడంపై అతని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ.. రాష్ట్రానికి ఎంతో పేరు తెచ్చిన ధోనీ రిక్వెస్ట్‌ను పరిగణలోకి తీసుకోరా? అని మండిపడుతున్నారు. ఈ టోర్నీని తాము బహిష్కరిస్తున్నామని హెచ్చరించారు.

Story first published: Friday, August 11, 2023, 20:48 [IST]
Other articles published on Aug 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+