Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Buchi Babu Tournament: ఫైనల్ చేరిన హైదరాబాద్!

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న బుచ్చి బాబు క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు ఫైనల్‌ చేరింది. ఆతిథ్య టీఎన్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో గురువారం ముగిసిన సెమీఫైనల్లో హైదరాబాద్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది.

దులీప్ ట్రోఫీ 2024 కోసం హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ తిలక్ వర్మ జట్టుకు దూరంగా కాగా.. రాహుల్ సింగ్ జట్టును నడిపించాడు. మూడు విభాగాల్లో సమష్టిగా రాణించిన హైదరాబాద్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

Buchi Babu Tournament Spinners Tanay Aniket help Hyderabad reaches final after beat TNCA President XI

హైదరాబాద్ విధించిన 260 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన టీఎన్‌సీఏ ప్రెసిడెంట్ ఎలెవన్ 68.2 ఓవర్లలో 195 పరుగులకు కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్(5/62), అనికేత్ రెడ్డి(4/59) టీఎన్‌సీఏ పతనాన్ని శాసించగా.. రోహిత్ రాయుడు ఓ వికెట్ తీసాడు.

టీఎన్‌సీఏ ప్రెసిడెంట్ ఎలెవన్ బ్యాటర్లలో రాధాకృష్ణన్(40), మాధవ ప్రసాద్(39) టాస్ స్కోరర్లుగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 78.4 ఓవర్లలో 313 పరుగులు చేసింది. హిమతేజ(91) తృటిలో శతకం చేజార్చుకోగా.. నితేష్ కన్నా(59), సీవీ మిలింద్(58) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. తనయ్ త్యాగరాజన్(40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 9వ వికెట్‌కు 54 పరుగులు జోడించాడు.

అనంతరం తమిళనాడు ప్రెసిడెంట్ ఎలెవన్ 100.4 ఓవర్లలో 327 పరుగులు చేసింది. 14 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. రితిక్ ఈశ్వరన్(100) సెంచరీ చేయగా.. విమల్(75) హాఫ్ సెంచరీతో రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్(7/95) ఏడు వికెట్లతో సత్తా చాటగా.. సీవీ మిలింద్(2/59) రెండు వికెట్లు తీసాడు.

14 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ 81 ఓవర్లలో 9 వికెట్లకు 273 పరుగులకు డిక్లేర్ చేసింది. రోహిత్ రాయుడు(104 బంతుల్లో 61), సీవీ మిలింద్(53) హాఫ్ సెంచరీలతో రాణించారు. సెప్టెంబర్ 8న ప్రారంభమయ్యే ఫైనల్లో హైదరాబాద్.. చత్తీస్‌ఘడ్‌తో తలపడనుంది. ఫైనల్ చేరిన హైదరాబాద్ జట్టును హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు అభినందించారు.

Story first published: Friday, September 6, 2024, 11:10 [IST]
Other articles published on Sep 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+