Buchi Babu tournament: ఫ్రస్టేషన్‌లో ప్రమాదకర బౌలింగ్.. క్షమాపణలు చెప్పిన సూరీడు!(వీడియో)
బుచ్చిబాబు టోర్నీతో దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్.. డేంజరస్ బౌలింగ్‌తో వార్తల్లో నిలిచాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఎలెవన్(టీఎన్‌సీఏ) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై దారుణంగా విఫలమైంది. దాంతో తీవ్ర అసహనానికి గురైన సూర్యకుమార్ యాదవ్ ఆ ఫ్రస్టేషన్‌ను బంతిపై చూపించాడు. బీమర్ విసిరాడు. ప్రమాదకరంగా వచ్చిన ఈ బంతిని బ్యాటర్ చాకచక్యంగా ఆడి బౌండరీకి తరలించాడు. వెంటనే తన తప్పిదాన్ని తెలుసుకున్న సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్‌కు క్షమాపణలు చేప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ ఘటన మూడో రోజు ఆటలో చోటు చేసుకుంది. సూర్యవేసిన బీమర్‌ను తమిళనాడు బ్యాటర్ అతిష్ ఎస్ఆర్ బౌండరీకి తరలించాడు. సూర్య తప్పిదం కారణంగా షార్ట్ ఫీల్డర్ గాయపడే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి కాదు. శ్రీలంక పర్యటనలో టీ20 మ్యాచ్‌లో సూపర్ ఓవర్ బౌలింగ్ చేసి భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. టెస్ట్ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంపై ఫోకస్ పెట్టిన సూర్యకుమార్ యాదవ్.. బుచ్చిబాబు టోర్నీలో బరిలోకి దిగాడు. ఈ టోర్నీలో రాణించడం ద్వారా టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బౌలింగ్‌పై సూర్య ఫోకస్ పెట్టాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన తమిళనాడు 117.3 ఓవర్లలో 379 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 63.2 ఓవర్లలో 156 పరుగులకు కుప్పకూలింది. దివ్యాన్ష్ సక్సెనా(57) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
సూర్యకుమార్ యాదవ్ 38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 30 పరుగులు చేసి ఔటయ్యాడు.
అనంతరం తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు కుప్పకూలింది. దాంతో ముంబై ముందు 510 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. ఈ భారీ లక్ష్యచేధనకు దిగిన ముంబై.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications