Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ.. ధోనీని అనుసరించాలి: అఫ్రీది

Virat Kohli should follow MS Dhonis footsteps, needs to win a series abroad: Shahid Afridi

ముంబై: వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా వెలుగొందుతున్న కోహ్లీ కెప్టెన్‌గానూ తన సత్తా చాటాలని పిలుపునిచ్చాడు. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌గా ఆస్ట్రేలియా ఎలెవన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడింది టీమిండియా. దీనిని డ్రాగా ముగించుకుని సోమవారం తొలి టెస్టు మ్యాచ్ సన్నాహాలకు అడిలైడ్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో కోహ్లీ విదేశాల్లో సిరీస్ గెలిచి తన సత్తా చాటాలని పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది పేర్కొన్నాడు.

ధోనీ అడుగుజాడల్లో నడవాలని

ధోనీ అడుగుజాడల్లో నడవాలని

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే పాక్ స్టార్ క్రికెటర్.. అఫ్రీది టీమిండియా కెప్టెన్ కోహ్లీని పొగడ్తల్లో ముంచెత్తుతున్నాడు. స్వదేశంలో వరుస సిరీసులు గెలిపిస్తున్న విరాట్‌ విదేశాల్లో తన కెప్టెన్సీ నైపుణ్యాలను ఇంకా నిరూపించుకోలేదు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లో కొన్ని తప్పులు చేయడంతో సిరీస్‌లు చేజారాయి. ఈ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ మాజీ కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్, జార్ఖాండ్ డైనమేట్ ఎంఎస్ ధోనీ అడుగుజాడల్లో నడవాలని పాక్‌ క్రికెటర్‌ షాహిది అఫ్రిది సూచించాడు.

బాధ్యతలు భుజాలపై మోస్తూ జట్టును

బాధ్యతలు భుజాలపై మోస్తూ జట్టును

‘ఒక నాయకుడిగా విరాట్‌ విదేశాల్లో సిరీస్‌ గెలవాలి. ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా ధోనీ భారత క్రికెట్‌ స్థితిగతులను ఎలా మార్చాడో ఎప్పుడూ చెప్తుంటా. కోహ్లీ అనుసరించేందుకు ఇదే అత్యుత్తమ మార్గం. అతడు సవాళ్లను ఇష్టపడతాడు. బాధ్యతలు భుజాలపై మోస్తూ జట్టును ముందుకు తీసుకెళ్తాడు' అని అఫ్రిది అన్నాడు. ప్రస్తుతం అఫ్రిది టీ10 క్రికెట్‌లో బిజీగా ఉన్నాడు.

ప్రాక్టీసులో కనిపించే విధంగా మైదానంలోనూ అలాగే

ప్రాక్టీసులో కనిపించే విధంగా మైదానంలోనూ అలాగే

కోహ్లీ గురించి తెలుసుకోవాలంటే అతని రికార్డులే చెబుతాయి. అతనొక అద్భుతమైన ఆటగాడు. ప్రాక్టీసులో ఏ విధంగా కనిపిస్తాడో మైదానంలోనూ తన ఆటను అలాగే ప్రదర్శిస్తాడు. ఛాలెంజ్‌లను ఎక్కువగా ఇష్టపడే కోహ్లీ జట్టును ముందుకు నడిపించడంలో చక్కని బాధ్యతను తీసుకుంటున్నాడు.

Story first published: Tuesday, December 4, 2018, 10:17 [IST]
Other articles published on Dec 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+