Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Brisbane Test: ఆంక్షలు సడలిస్తేనే నాలుగో టెస్టు ఆడతాం.. లేదంటే ఇంటికే: బీసీసీఐ

Brisbane Test: BCCI formally writes to CA on relaxation of quarantine in Brisbane

సిడ్నీ: బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో జరగనున్న నాలుగో టెస్టు ఆడాలంటే భారత క్రికెటర్లకు కఠిన క్వారంటైన్‌ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు బీసీసీఐ అధికారికంగా లేఖ రాసింది. ఆంక్షలు సడలిస్తేనే నాలుగో టెస్టు ఆడతాం అని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాకు వచ్చేముందు భారత జట్టు రెండు నగరాల్లో కఠిన క్వారంటైన్‌ అయ్యేందుకు ఒప్పందం చేసుకోలేదని లేఖలో తెలిపింది. దుబాయ్‌ నుంచి రాగానే సిడ్నీలో ఆటగాళ్లు ఐసోలేషన్‌కు వెళ్లారని గుర్తుచేసింది. పర్యటనకు ముందు చేసుకున్న ఒప్పందంలోని అంశాలను బీసీసీఐ అత్యున్నత అధికారి.. సీఏ అధినేత ఎర్ల్‌ ఎడింగ్స్‌ దృష్టికి తీసుకొచ్చారు.

కేసులు పెరగడంతో:

కేసులు పెరగడంతో:

ప్రస్తుతం జరుగుతున్న సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత టీమిండియా బ్రిస్బేన్‌లో చివరి టెస్ట్ ఆడాల్సి ఉంది. గబ్బా వేదికగా నాలుగో టెస్టు జనవరి 15న ఆరంభమవుతుంది. అయితే బ్రిస్బేన్‌లో ఉన్న క్వీన్స్‌లాండ్‌లో ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు పెరగడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. దీంతో చివరి టెస్ట్ కోసం బ్రిస్బేన్‌ నగరానికి చేరుకున్న వెంటనే.. ఆటగాళ్లంతా హోటల్‌ గదులకు మాత్రమే పరిమితం అవ్వాలని అక్కడి ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఇలాంటి వాతావరణానికి భారత క్రికెటర్లు ససేమిరా అంటున్నారు.

సడలింపులు ఇవ్వాలి:

సడలింపులు ఇవ్వాలి:

'చివరి టెస్టు జరగడంపై చర్చలు జరుగుతున్నాయి. బ్రిస్బేన్‌లో మ్యాచ్‌ కావాలంటే.. కఠిన క్వారంటైన్‌ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని బీసీసీఐ అధికారికంగా ఈరోజు లేఖరాసింది. పర్యటనకు ముందు చేసుకున్న ఒప్పందంలో రెండు కఠిన క్వారంటైన్‌లు లేవు. సిడ్నీలో భారత్ ఒక కఠిన క్వారంటైన్‌ పూర్తిచేసుకుంది. ఆటగాళ్లు ఐపీఎల్‌ తరహాలో హోటల్‌ లోపల బయోబుడగ కావాలని కోరుకుంటున్నారు. కలిసి భోజనం చేయాలని, కలిసి జట్టు సమావేశాలకు హాజరు అవ్వాలని కోరుకుంటున్నారు. నిజానికి ఇదో పెద్ద డిమాండే కాదు' అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

ఐపీఎల్‌ తరహా బుడగ కావాలి:

ఐపీఎల్‌ తరహా బుడగ కావాలి:

క్రికెట్‌ ఆస్ట్రేలియా సైతం హోటల్లో ఒకర్నొకరు కలుసుకోవచ్చని చెబుతోంది. అయితే ఒకే అంతస్తులోని వారు మాత్రమే కలుసుకోవాలి. ఇతర అంతస్తుల్లో ఉన్నవారు మిగతా వారిని కలవకూడదు. ఈ నిబంధననే భారత క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు. 'సడలింపులపై రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాను బీసీసీఐ కోరుతోంది. దుబాయ్‌ నుంచి సిడ్నీకి వచ్చిన తర్వాత ఆటగాళ్లు ఒకర్నొకరు కలుసుకోకుండా హోటల్‌ అంతస్తుల్లో పోలీసులను మోహరించారు. బ్రిస్బేన్‌కు వెళ్లాక అలాంటివి జరగొద్దన్నదే మా ఉద్దేశం. మాకు కావాల్సిందల్లా ఐపీఎల్‌ తరహా బయోబుడగ' అని సదరు బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.

Sydney Test: లంచ్ బ్రేక్.. రెండేసి జడేజా!! తొలి సెషన్‌లో టీమిండియాదే ఆధిపత్యం!

Story first published: Friday, January 8, 2021, 8:45 [IST]
Other articles published on Jan 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+