Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022 Mega Auction:ముహుర్తం ఫిక్స్.. తేదీలను వెల్లడించిన బ్రిజేష్ పటేల్

Brijesh Patel says IPL 2022 mega auction in Bengaluru on February 12-13

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్(ఐపీఎల్) 2022 మెగా వేలానికి ముహుర్తం ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా ఈ ధనాధన్ లీగ్ వేలం జరగనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్‌ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లక్నోలకు లైన్ క్లియరైందన్నాడు. రెండు జట్లకు 'లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్'ను జారీ చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అదేవిధంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా క్లియరెన్స్‌ ఇచ్చిందన్నారు.

కొత్త జట్లకు లైన్ క్లియర్..

కొత్త జట్లకు లైన్ క్లియర్..

'కొత్త ఫ్రాంచైజీల రెండు బిడ్‌లను ఐపీఎల్ గవర్నింగ్‌ కౌన్సిల్ ఆమోదించింది. ఎల్‌వోఐను త్వరలోనే జారీ చేస్తాం. దీని వల్ల బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగబోయే మెగా వేలానికి లైన్ క్లియర్ అయింది. ఇక నిబంధన ప్రకారం కొత్త జట్లు వేలానికి ముందే ముగ్గురేసి ఆటగాళ్లను ఎంచుకోవచ్చు.''అని వివరించారు. ఇప్పటికే కొత్త ఫ్రాంచైజీలు సహాయక సిబ్బందిని ఎంపిక చేసుకున్నాయి. ఇక ముగ్గురు ఆటగాళ్లను కూడా ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. లక్నోకు కేఎల్ రాహుల్, అహ్మదాబాద్‌ జట్టుకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి.

భారత్‌లోనే ఐపీఎల్ 2022

భారత్‌లోనే ఐపీఎల్ 2022

రెండు వారాల్లో కొత్త జట్లు ప్లేయర్లను ఎంచుకునే వెసులుబాటు ఉందని బ్రిజేష్‌ పటేల్ తెలిపారు. ''మేం కొత్త ఫ్రాంచైజీ యాజమాన్యాలతో మాట్లాడాం. వారికి ఆటగాళ్లను ఎంచుకునేందుకు పది రోజుల నుంచి రెండు వారాల సమయం ఇవ్వాలని భావిస్తున్నాం. అదేవిధంగా భారత్‌లోనే ఐపీఎల్‌ను నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నాం. అయితే కొవిడ్‌ వ్యాప్తిని నిరంతరం గమనిస్తూనే ఉంటాం'.' అని బ్రిజేష్ పటేల్ వెల్లడించారు.

ఇక టాటా ఐపీఎల్

ఇక టాటా ఐపీఎల్

దేశీయ దిగ్గజ కార్పొరేట్‌ సంస్థ టాటా గ్రూప్‌ 2022 నుంచి ఐపీఎల్‌ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని బ్రిజేష్‌ పటేల్‌ వెల్లడించారు. ' ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా టాటా గ్రూప్‌ వ్యవహరించనుంది'' అని బ్రిజేష్‌ పేర్కొన్నారు. 2018-22 వరకు ఐపీఎల్‌ స్పాన్సరింగ్‌ హక్కులను వివో సంస్థ రూ.2,200కోట్లకు దక్కించుకొంది. కానీ, 2020లో గల్వాన్‌ వద్ద భారత్‌-చైనా సేనలు ఘర్షణ పడటంతో ఆ ఏడాది వివో స్పాన్సర్‌ షిప్‌ నుంచి వైదొలగింది.

ఈ నేపథ్యంలో డ్రీమ్‌11 సంస్థ స్పాన్సరింగ్‌ బాధ్యతలు స్వీకరించింది. 2021 ఐపీఎల్‌ టైటిల్‌ బాధ్యతలను వివోనే తిరిగి స్వీకరించింది. ఆ తర్వాత నుంచి స్పాన్సర్లు మారనున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా టాటా గ్రూప్‌ బిడ్డింగ్‌కు ఓకే చెప్పినట్లైంది. దీంతో 2022తో పాటు 2023లో 'టాటా ఐపీఎల్‌'గా అభిమానుల ముందుకు రానుంది.

Story first published: Tuesday, January 11, 2022, 20:49 [IST]
Other articles published on Jan 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+