Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni vs Lara Fight: మహీ హ్యాట్రిక్ సిక్సర్లతో విసిగిపోయిన విండీస్ దిగ్గజం! (వీడియో)

Brian Lara Says To MS Dhoni Walk-off From The Ground In 2006 Test Match
MS Dhoni VS Brian Lara Fight మైదానం వీడమన్న లారా | Controversial Dismissal || Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. మంచి ఫినిషర్‌ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో సిక్స్‌తో 28 ఏళ్ల కలను సాకారం చేసిన క్షణం ఇప్పటికీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. ఆ ఒక్క మ్యాచే కాదు.. మరెన్నో మ్యాచ్‌ల్లో మహీ తనదైన ఫినిషింగ్‌తో మ్యాచ్‌లను పూర్తి చేశాడు. భారత క్రికెట్ చరిత్రలోనే ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. టీ20, వన్డే ప్రపంచకప్‌లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ అందించిన ధోనీ.. ఐసీసీ టైటిళ్లన్నీ అందించిన ఏకైక సారథిగా గుర్తింపు పొందాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండే ధోనీని అంతా మిస్టర్ కూల్ అంటారు. అయితే ఓ టెస్ట్ మ్యాచ్‌లో ఈ మిస్టర్ కూల్‌తో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా వాగ్వాదానికి దిగాడు. మహీ సిక్సర్లకు విసిగిపోయిన అతను క్యాచ్ ఔట్ విషయంలో మైదానం వీడాల్సిందిగా పట్టుబట్టాడు. అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మరి ధోనీతో గొడవపడ్డాడు. ఈ లాక్‌డౌన్‌లో ఆ ఘటనను ఓ సారి గుర్తు చేసుకుందాం.

2006 విండీస్ టూర్‌లో..

2006 విండీస్ పర్యటనలో భాగంగా సెయింట్ జోన్స్ వేదికగా జరిగిన ఫస్ట్‌ టెస్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా తొలి ఇన్నింగ్స్ 241 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మినహా(49) అంతా విఫలమయ్యారు. అనంతరం లారా నేతృత్వంలో విండీస్ 371 పరుగులు చేసి 130 పరుగుల లీడ్ సాధించింది. క్రిస్ గేల్(72), డ్వేన్ బ్రావో(68),రామ్‌నరేశ్(58) రాణించారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్ జూలు విధిల్చారు. ఓపెనర్ వసీం జాఫర్(399 బంతుల్లో 24 ఫోర్లు, సిక్స్‌తో 212) డబుల్ సెంచరీతో చెలరేగగా.. సెహ్వాగ్(41), లక్ష్మణ్(31), యువరాజ్(39), రాహుల్ ద్రవిడ్(62) ఫర్వాలేదనిపించడంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లింది.

హ్యాట్రిక్ సిక్సర్లతో...

హ్యాట్రిక్ సిక్సర్లతో...

మహ్మద్ కైఫ్‌తో జత కలిసిన మహేంద్ర సింగ్ ధోనీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విండీస్ స్పిన్నర్ డేవ్ మహ్మద్‌ను లక్ష్యంగా చేసుకొని వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తనదైన హెలీక్యాప్టర్ షాట్లతో బంతిని బౌండరీకి తరలించాడు. పదే పదే స్టెప్ ఔట్ అవుతూ భారీ సిక్సర్లు కొట్టాడు. ఇక డేవ్ మహ్మద్ వేసిన 151వ ఓవర్‌లో ధోనీ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. ఆ ఓవర్ రెండో బంతిని ఓవర్ లాంగాన్ మీదుగా సిక్సర్‌ కొట్టిన ధోనీ.. మరుసటి బంతిని క్రీజు ధాటి మైదానం బయట పడేశాడు. నాలుగో బంతిని ఓవర్ లాంగ్ లెగ్ దిశగా మరో సిక్సర్ బాదాడు. అదే జోరులో ఐదో బంతిని డీప్ మిడ్ వికెట్‌మీదుగా భారీ షాట్ ఆడగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న డారెన్ గంగా బౌండరీ లైన్‌పై బంతిని అందుకున్నాడు. ఇక ఇక్కడే అసలు డ్రామా మొదలైంది.

 ధోనీతో లారా గొడవ..

ధోనీతో లారా గొడవ..

తొలుత ఔట్‌గా భావించిన ధోనీ.. మైదానం వీడేందుకు సిద్దమయ్యాడు. కానీ అంపైర్లు క్యాచ్‌పై సందేహం వ్యక్తం చేస్తూ థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు. క్యాచ్ అందుకునే క్రమంలో గంగా బౌండరీ లైన్ తాకినట్లు రిప్లేలో కనిపించింది. టీవీ అంపైర్ పలు కోణాల్లో పరిశీలించినా ఔటైనట్లు స్పష్టత రాలేదు. దాంతో అంపైర్లు బెన్‌ఫిట్ ఆఫ్ బ్యాట్స్‌మన్ కింద నాటౌటిచ్చారు. కానీ ధోనీ సిక్సర్లతో అప్పటికే విసిగిపోయిన లారా.. తన ఫీల్డర్ చెప్పే మాటలు నమ్మాలని, అతను బౌండరీ లైన్ తాకలేదని స్పష్టంగా చెబతున్నాడని వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ధోనీతో కూడా లారా ఆర్గ్యూ చేశాడు.

 డిక్లేర్ ఇచ్చిన ద్రవిడ్..

డిక్లేర్ ఇచ్చిన ద్రవిడ్..

ఇదంతా డ్రెస్సింగ్ రూమ్‌ నుంచి గమనించిన అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్.. ఈ వివాదం పెద్దది గాకుండా జాగ్రత్త పడ్డాడు. ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించడంతో గొడవ సద్దుమణిగింది. అయితే లారా విజ్ఞప్తికి ధోనీ అంగీకరించడంతో ఫీల్డర్ మాటలను పరిగణలోకి తీసుకున్న అంపైర్లు ఔటిచ్చారు. భారీ లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విండీస్.. 298/9తో ఓటమి నుంచి గట్టెక్కింది. ఇక ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా.. సిరీస్‌ను భారత్ 1-0తో గెలుచుకుంది. అయితే ధోనీ-లారా మధ్య జరిగిన గొడవ మాత్రం క్రికెట్ చరిత్రలో అలానే నిలిచిపోయింది.

Story first published: Wednesday, May 26, 2021, 13:18 [IST]
Other articles published on May 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+