Brian Lara: కోహ్లీ సక్సెస్‌ను ఓర్వలేకనే అలా అంటున్నారు!
Brian Lara: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సక్సెస్‌ను ఓర్వలేకనే అతనిపై అనవసర విమర్శలు చేస్తున్నారని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. విరాట్ కోహ్లీ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతారనే విమర్శలకు అర్థం లేదని కొట్టిపారేసాడు. కోహ్లీపై ఉన్న ఈర్శతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని అభిప్రాయపడ్డాడు.
తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ గురించి బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను విరాట్ కోహ్లీకి వీరాభిమానిని. అతని క్రమిశిక్షణ, ఆటపట్ల ఉన్న అంకిత భావం నాకు చాలా ఇష్టం. అతను తన సర్వస్వాన్ని అందించి మ్యాచ్‌కు సిద్ధమయ్యే విధానాన్ని చూస్తే ఎవరైనా కోహ్లీని అభిమానించాల్సిందే.

కోహ్లీ వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడుతాడనే విమర్శలు అర్థం లేనివి. అలా మాట్లాడే వారంతా అతని సక్సెస్‌ను చూసి ఓర్వలేనివారే. అతను చేసిన పరుగులను చూసి అసూయపడుతున్నారు. నా కెరీర్‌లో కూడా నేను ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నాను.'అని బ్రియాన్ లారా సమాధానమిచ్చాడు.సచిన్ టెండూలర్క్ 100 సెంచరీల రికార్డును బద్దలుకొట్టడం అసాధ్యమని, విరాట్ కోహ్లీ వల్ల కూడా అది కాదని లారా అభిప్రాయపడ్డాడు.
'ప్రస్తుతం విరాట్ కోహ్లి వయస్సు 35 ఏళ్లు. అతను ఇప్పటికే 80 సెంచరీలు సాధించాడు. సచిన్ రికార్డ్ అందుకోవాలంటే మరో 20 శతకాలు నమోదు చేయాలి. అతడు ప్రతి ఏడాది ఐదు శతకాలు చేసినా.. మరో నాలుగేళ్లు పడుతుంది. అప్పుడు కోహ్లీ వయసు 39కి చేరుతోంది. ఆ వయసులో క్రికెట్ ఆడటం.. సెంచరీలు చేయడం అంత సులువైన పనికాదు.
అయితే అది ఎవరూ సాధించలేరని మాత్రం నేను అనడం లేదు. కానీ, సచిన్ రికార్డును కోహ్లి అధిగమిస్తాడని చాలా మంది చెబుతుంటారు. అందులో చాలా మంది ఏమాత్రం లాజిక్ లేకుండా మాట్లాడుతుంటారు. 20 సెంచరీలు అనేది అంత ఈజీ కాదు. చాలా మంది క్రికెటర్లు తమ కెరీర్ లోనే 20 సెంచరీల మార్క్‌ను అందుకోలేరు. అందుకే 100 సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొడతాడని అనుకోవట్లేదు. వయస్సు ఎవరికీ ఆగదు' అని లారా చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications