Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ కాదు.. అతనే గొప్ప బ్యాటర్: బ్రియాన్ లారా

వెస్టీండీస్ మాజీ ఆల్‌రౌండర్ కార్ల్ హూపర్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్, దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా ప్రశంసల జల్లు కురిపించాడు. తాను చూసిన అత్యుత్తమ బ్యాటర్లలో కార్ల్ హూపర్ ఒకరని కొనియాడాడు.సచిన్ టెండూల్కర్‌తో పాటు తన కంటే కూడా కార్ల్ హూపర్ గొప్ప బ్యాటర్‌ అని లారా అభిప్రాయపడ్డాడు.

అసాధారణ రికార్డులు నెలకొల్పడంతో తనతో పాటు సచిన్ టెండూల్కర్‌ను గొప్ప బ్యాటర్‌గా అందరూ భావిస్తుంటారని, కానీ తమ కంటే కార్ల్ హూపర్ గొప్ప ఆటగాడని చెప్పుకొచ్చాడు. సహజసిద్దమైన నైపుణ్యం పరంగా కార్ల్ హూపర్ కాలి గోటికి కూడా తాము పనికిరామన్నాడు.

Brian Lara says He was more talented than Sachin Tendulkar

'నేను చూసిన అత్యుత్తమ ఆటగాళ్లలో కార్ల్ హూపర్ ఒకరు. సచిన్ టెండూల్కర్‌తో పాటు నేను కూడా కార్ల్‌కు ఉన్న నైపుణ్యానికి దరిదాపుల్లో లేము. కెరీర్ ఆరంభం నుంచి కెప్టెన్ అయ్యేవరకు అతని గణంకాలు చాలా భిన్నంగా ఉన్నాయి. కెప్టెన్‌గా దాదాపు 50 సగటుతో విజయాలు సాధించాడు. కానీ అతను తన సామర్థ్యాలను ఆటగాడిగా కాకుండా కెప్టెన్‌గా మాత్రమే ఉపయోగించుకోవడం బాధాకరమైన విషయం'అని లారా చెప్పుకొచ్చాడు.

దిగ్గజ బ్యాటర్ వీవీ రిచర్డ్స్‌ కూడా హూపర్‌పై ప్రత్యేక అభిమానం చూపించేవాడని లారా గుర్తు చేసుకున్నాడు. వివ్ రిచర్డ్స్ ఎప్పుడూ ఒక వ్యక్తి ఎదుగుదలను చూసి అసూయపడలేదని, అతని గొప్పదనం ఎప్పటికీ తగ్గదన్నాడు. ఇతరులు తనకంటే బాగా ఆడకూడదని ఎప్పుడూ కోరుకోలేదని చెప్పుకొచ్చాడు. వివ్ రిచర్డ్స్ తన కంటే కార్ల్ హూపర్‌ను ఎక్కువగా ఇష్టపడేవాడని తెలిపాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ కనీవినీ ఎరుగని రికార్డులు నమోదు చేశాడు.టెస్ట్‌ల్లో 15,921, వన్డేల్లో 18,426 పరుగులతో ఆల్ టైమ్‌ టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లో కలిపి 100 శతకాలు నమోదు చేసిన బ్యాటర్‌గానూ నిలిచాడు. అతను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొని 11 ఏళ్లు అవుతున్నా.. ఈ రికార్డ్స్ చెక్కుచెదరలేదు.

మరోవైపు బ్రియన్ లారా టెస్ట్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు నమోదు చేశాడు. అంతర్జాతీయ టెస్ట్‌ల్లో 400, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 501 పరుగుల చేశాడు. ఈ రికార్డ్స్ కూడా ఎవరూ అధిగమించలేదు.

Story first published: Tuesday, July 16, 2024, 15:17 [IST]
Other articles published on Jul 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+