న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇక వీడు మారడు.. కేన్ విలియమ్సన్ ఔటవ్వడంతో తలపట్టుకున్న బ్రియాన్ లారా! (వైరల్ ఫొటో)

 Brian Lara reaction after poor shot leads to Kane Williamson dismissal goes viral

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లోనూ కేన్ దారుణంగా విఫలమయ్యాడు. 17 బంతుల్లో ఓ బౌండరీతో 9 పరుగులు మాత్రమే చేసి రస్సెల్ బౌలిగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక కేన్ విలియమ్సన్ ఔటైన తీరును చూసి డగౌట్‌లో ఉన్న ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా తలను పట్టుకున్నాడు. ఇక వీడు మారడన్నట్లు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

మ్యాచ్‌లు మారుతున్నా కేన్ విలియమ్సన్ ఆటతీరు మారకపోవడంతో బ్రియాన్ లారా బాగా డిస్సపాయింట్ అవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందు మార్కో జాన్సెన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో డగౌట్‌లో ఉన్న ముత్తయ్య మురళీధరన్, ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడిన కేన్ విలియమ్సన్ 208 పరుగులు చేశాడు. యావరేజ్ 17.33 కాగా స్ట్రైయిక్ రేటు 92 మాత్రమే. కనీసం 100+ స్ట్రైయిక్ రేటు కూడా మెయింటైన్ చేయలేకపోతున్న కేన్ విలియంసన్, ఓపెనర్‌గా వస్తూ విలువైన పవర్ ప్లేలో బంతులను వృథా చేస్తున్నాడు. కేన్ వైఫల్యం జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కేకేఆర్‌తో 55 పరుగుల తేడాతో ఓటమిపాలైన ఆరెంజ్ ఆర్మీ.. వరుసగా ఐదు పరాజయాలతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్(28 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 49 నాటౌట్), సామ్ బిల్లింగ్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34) రాణించగా... అజింక్యా రహానే(24 బంతుల్లో 3 సిక్స్‌లతో 28),నితీశ్ రాణా(16 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 26) ధాటిగా ఆడారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లతో చెలరేగగా.. భువీ, జాన్సెన్, నట్టూ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు మాత్రమే చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది. అభిషేక్ శర్మ(28 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్‌లతో 43), ఎయిడెన్ మార్క్‌రమ్(25 బంతుల్లో 3 సిక్స్‌లతో 32) మినహా అంతా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో రస్సెల్ మూడు వికెట్లు తీయగా.. టీమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, May 15, 2022, 15:08 [IST]
Other articles published on May 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X