ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో చిటికతో ఛీటింగ్.. క్లిక్కీ పాంటింగ్‌పై వేటు!
క్రికెట్‌లో స్లెడ్జింగ్, బాల్ ట్యాంపరింగ్ వంటి ఘటనలను చూశాం. కానీ ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్‌లో జరిగిన ఓ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వరెపోయేలా చేసింది. చిటిక వేసి అంపైర్లను మోసం చేసిన ఓ క్లబ్ ప్లేయర్ ఉదంతం క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేస్తుంది.
సదరు ప్లేయర్‌కు క్లిక్కీ పాంటింగ్ అని బిరుదు ఇవ్వడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్లెడ్జింగ్‌కు మారు పేరనడంలో సందేహం లేదు. అందుకే సదరు ఛీటింగ్ ప్లేయర్‌కు క్లిక్కీ పాంటింగ్ అని పేరు పెట్టారు.
అసలేం జరిగిందంటే..?
నార్త్ యార్క్‌షైర్ అండ్ సౌత్ డర్హామ్ క్రికెట్ లీగ్‌లో భాగంగా సాల్ట్‌బర్న్, మిడిల్స్‌బ్రో సెకండ్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ వింత మోసం చోటు చేసుకుంది. సాల్ట్‌బర్న్ టీమ్ ఫీల్డర్ బ్రియాన్ డెవిన్.. చిటిక వేసి అంపైర్లను తప్పుదోవ పట్టించాడు.

సరిగ్గా బంతి బ్యాటర్‌ను దాటి వెళ్తున్న కమ్రంలో తన వేళ్లతో 'క్లిక్'మని శబ్దం వచ్చేలా చేసాడు. ఆ శబ్దాన్ని బ్యాట్ ఎడ్జ్ సౌండ్‌గా భావించిన అంపైర్.. కీపర్ క్యాచ్‌గా ఔట్ ఇచ్చాడు. బ్యాటర్ ఎంత చెప్పినా అంపైర్లు వినిపించుకోలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే బ్రియాన్ డెవిన్ ఇలా పలు మ్యాచ్‌ల్లో చేసినట్లు తెలుస్తోంది.
క్లిక్కీ పాంటింగ్‌పై వేటు..
నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో బ్రియాన్ డెవిన్‌పై సాల్ట్‌బర్న్ క్రికెట్ క్లబ్ నిషేధం విధించింది. ఈ ఘటనపై మిడిల్స్‌బ్రో టీమ్ కెప్టెన్ స్పందిస్తూ.. ఇది ఒకే మ్యాచ్‌కు పరిమితం కాలేదని, గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని ఆరోపించాడు. ఈ తరహా మోసాల వల్ల తమ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని అసహనం వ్యక్తం చేశాడు. ఈ తరహా మోసంతో ఒకే మ్యాచ్‌లో ముగ్గురు బ్యాటర్లు ఔటయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని లీగ్ యాజమాన్యం ప్రకటించింది. క్రికెట్ చరిత్రలో బ్రియాన్ డెవిన్ అతిపెద్ద చీటర్ అని పియర్స్ మోర్గాన్ అనే టీవీ వ్యాఖ్యత ట్వీట్ చేశాడు. ఈ వివాదం కారణంగా డెవిన్‌కు స్థానికంగా స్పాన్సర్‌గా ఉన్న 'స్పైసెస్' అనే ఇండియన్ రెస్టారెంట్ కూడా తమ డీల్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

