IND vs ZIM: టీమిండియా ఘోర తప్పిదం.. కొంపముంచిన అలసత్వం!
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా ఘోర తప్పిదం చేసింది. జింబాబ్వే ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే అలసత్వంతో మూల్యం చెల్లించుకుంది. మయాంక్ యాదవ్ వేసిన ఈ ఓవర్ ఆఖరికి బంతికి బ్రియాన్ బెన్నెట్ క్యాచ్ ఔటయ్యాడు. కానీ భారత ఆటగాళ్లు ఎవరూ అప్పీల్ చేయలేదు.
మయాంక్ యాదవ్ వేసిన ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ షార్ట్ లెంగ్త్ డెలివరీని బెన్నెట్ ఆఫ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతిలో పడింది. కానీ ఎవరూ అప్పీల్ చేయలేదు. కానీ రీప్లేలో బ్యాట్‌కు బంతి ఎడ్జ్ అయినట్లు స్నీకో మీటర్‌లో చూపించింది. దాంతో భారత ఆటగాళ్లంతా నెత్తి పట్టుకున్నారు. అప్పీల్ చేసుంటే బెన్నెట్ 10 పరుగులకే వెనుదిరిగేవాడు.

యశ్ ఠాకూర్ వేసిన మరుసటి ఓవర్‌లోనూ బెన్నెట్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను తిలక్ వర్మ వదిలేసాడు. ఈ అవకాశాలతో అతను మరింత దూకుడుగా ఆడాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. చివరకు బెన్నెట్(32)ను యశ్ ఠాకూర్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 34 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇందులో 32 పరుగులు బెన్నెట్ చేయడం గమనార్హం. మరో ఓపెనర్ బెన్ కర్రెన్(1)ను ప్రిన్స్ యాదవ్ ఔట్ చేయగా.. డియోన్ మైయర్స్(12)ను రవి బిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో 48 పరుగులకే జింబాబ్వే మూడు వికెట్లు కోల్పోయింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81), తిలక్ వర్మ(29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వైభవ్ సూర్యవంశీ(9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 20) మెరుపులు మెరిపించగా.. శ్రేయస్ అయ్యర్(20 బంతుల్లో 4 ఫోర్లతో 25) పర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజర్బానీ, రిచర్డ్ నగర్వ, బ్రాడ్ ఇవాన్స్, న్యూమాన్ న్యామురి, బ్రియాన్ బెన్నెట్ తలో వికెట్ తీసారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

