For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ లాంటి ఆటగాడు తరానికి ఒక్కరే.. అతనికి నేను డైహార్డ్ ఫ్యాన్: బ్రెట్ లీ

Brett Lee says Virat Kohli is best cricketer on earth, dont expect him to score

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీ లాంటి ఆటగాడు తరానికి ఒక్కడే పుడుతారని, అతనికి తాను వీరాభిమానినని తెలిపాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే విరాట్ బెస్ట్ క్రికెటరని చెప్పాడు. విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ చూస్తేనే అతను ఎంత గొప్ప అథ్లెటో అనే విషయం అర్థమవుతుందన్నాడు. లెజెండ్స్ క్రికెట్ లీగ్ రెండో సీజన్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన బ్రెట్ లీ.. మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయా పంచుకున్నాడు.

'ప్రతీ ఒక్కరూ విరాట్ కోహ్లీని గమినిస్తూ ఉంటారు. విరాట్ కోహ్లీ గురించి ఎవరెవరు ఏమేం చెబుతున్నారో నేను అన్నీ వింటూ ఉంటా. కోహ్లీ అది అని, కోహ్లీ ఇది అని... ఎవేవో అంటారు. అయితే విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న బెస్ట్ క్రికెటర్లలో ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, జాక్వెస్ కలీస్ వంటి ప్లేయర్ల ఆటను చూసే అవకాశం దక్కడం మన అదృష్టం. విరాట్ కోహ్లీ బెస్ట్ క్రికెటర్ మాత్రమే కాదు వరల్డ్ బెస్ట్ అథ్లెట్ కూడా. అతని ఫిట్‌నెస్ చూడండి. ఇన్ని ఏళ్లుగా ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తున్నాడో చూడండి. అతని గణాంకాలు గమనించండి...

అలాంటి ప్లేయర్‌ని వదులుకోవాలని ఎవ్వరైనా అనుకుంటారా. అతను బంగారం. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు తరానికి ఒక్కడే వస్తారు. విరాట్ రోజు రోజుకీ తనని మరింత మెరుగుపర్చుకుంటాడు. అతని ఆటకి నేను వీరాభిమానిని.130 కోట్ల మంది అభిమానులు, విరాట్ కోహ్లీ ఆడిన ప్రతీ సారీ సెంచరీ చేయాలని కోరుకుంటారు. ఇంత ఒత్తిడిని తట్టుకుంటూ పర్ఫామెన్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి.'అని బ్రెట్ లీ అభిప్రాయపడ్డాడు.

Story first published: Saturday, September 17, 2022, 15:18 [IST]
Other articles published on Sep 17, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+