For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Brett Lee: పుజారా‌ బ్యాటింగ్‌పై అనుమానాలున్నాయ్.. ఏం చేస్తాడో!

Brett Lee says It will be a thing to see if Cheteshwar Pujara can do well in IPL
IPL 2021 : Mumbai Indians పై Harshal Patel సంచలన రికార్డ్ ! | RCB Vs MI || Oneindia Telugu

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్‌లో టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా ఎలా ఆడుతాడనేదానిపై తనకు అనుమానాలున్నాయని ఆస్ట్రేలియా దిగ్గజం బ్రెట్ లీ అన్నాడు. పుజారా అద్భుతమైన ఆటగాడని, అతని టెక్నిక్ విషయంలో ఎలాంటి సందేహం లేదని, కానీ టీ20 ఫార్మాట్‌కు తగ్గట్లు తన ఆటను మలుచుకుంటాడా? లేదా? అనేదే డౌట్‌గా ఉందని తెలిపాడు.

ఇక టెస్ట్ స్పెషలిస్ట్‌గా ముద్ర పడటంతో గత కొన్ని సీజన్లుగా పుజారాను తీసుకునేందుకు ఫ్రాంచైజీ‌లు ఆసక్తి కనబర్చలేదు. పైగా అతను ఇప్పటి వరకు ఆడిన 30 ఐపీఎల్ మ్యాచ్‌లో 21 సగటుతో కేవలం 390 పరుగులే చేశాడు. దాంతో అతను టెస్ట్ క్రికెట్‌కు పరిమితమయ్యాడు. అయితే ఈ సీజన్‌కు సంబంధించిన మినీ వేలంలో పుజారాను చెన్నై సూపర్ కింగ్స్ అతని కనీస ధర రూ.50 లక్షలు కొనుగోలు చేసింది. దాంతో అతను ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ధనాధన్ లీగ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సీఎస్క్ ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని తనపై ఉన్న టెస్ట్ క్రికెటరనే ముద్రను చెరపేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

ఇక అతను ఎలా ఆడతాడనేదాని కోసం అటు అభిమానులు ఇటు మాజీ క్రికెటర్లు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్ లీ పుజారా ఐపీఎల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'చతేశ్వర్ పుజారాను మనం రెండు కోణాల్లో చూడాలి. మొదటిది అతనో టెర్రిఫిక్ క్రికెటర్. అతని సామర్థ్యం, బ్యాటింగ్ టెక్నిక్, టైమింగ్, పట్టుదల విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మరో కోణంలో చూస్తే.. పుజారా సులువుగా రాణించేందుకు ఇది టెస్ట్ క్రికెట్ కాదు. 90 నిమిషాల్లో ముగిసే 20 ఓవర్ల టీ20 క్రికెట్. ఈ ఫార్మాట్‌లో చాలా వేగంగా పరుగులు చేయాల్సి ఉంటుంది.

మరీ ఎంతో ఒత్తిడి ఉండే ఈ ఫార్మాట్‌లో అతను వేగంగా పరుగులు చేయగలడా? అనేది సందేహం. అతను చేస్తాడనే నేను అనుకుంటున్నా. ఇటీవల ఆసీస్ పర్యటనలో కూడా పుజారా తన శైలికి భిన్నంగానే ఆడాడు. వేగంగా ఆడేందుకు ఇష్టపడినట్లు కనిపించింది. ఇది ఆసక్తికరమైన విషయమే. పుజారకు నేను పెద్ద అభిమానిని. అతనికిది మంచి అవకాశం. మరీ పుజారా ఏం చేస్తాడో చూద్దాం'అని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ తమ ఫస్ట్ మ్యాచ్‌ను శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. పుజారాను వేలంలో తీసుకోనైతే తీసుకున్న సీఎస్‌కే తుది జట్టులో అవకాశం కల్పిస్తుందా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.

Story first published: Friday, April 9, 2021, 16:41 [IST]
Other articles published on Apr 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+