Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీతో ఆ మాట చెప్పగానే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు: బ్రెట్‌ లీ

Brett Lee reveals Virat Kohlis sweet gesture for his son

సిడ్నీ: పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ అండగా నిలిచాడు. విరాట్ కోహ్లీ అతి త్వరలోనే ఫామ్ అందుకుంటాడని తెలిపాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా కోహ్లీ ఫామ్ గురించి మాట్లాడిన విరాట్.. అతనితో ఉన్న స్పెషల్ మూమెంట్‌ను గుర్తు చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న బ్రెట్ లీ.. తరుచూ ఇండియాకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీతో జరిగిన సంభాషణను బ్రేట్ లీ పంచుకున్నాడు.

'విరాట్ కోహ్లీతో ఓ స్పెషల్ మూమెంట్ నాకు ఎప్పటికీ గుర్తిండిపోయింది. భారత్‌లో ఓ టెస్టు మ్యాచ్ కోసం ఇక్కడికి వచ్చాను. ఆ మ్యాచ్‌కు నేను కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నా... నేను, కామెంటరీ చెబుతున్న సమయంలో విరాట్ నా దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీతో చాలాసేపు మాట్లాడాను. మేం ఇద్దరం కలిసి ఆడిన సమయంలో మూమెంట్స్‌ని గుర్తు చేసుకున్నాం. అప్పుడు నేను మా బాబు గురించి, కోహ్లీకి చెప్పాను.

'మా బాబు ప్రిస్టన్‌కి నువ్వు చాలా ఫెవరెట్ ప్లేయర్‌వి. నీ బ్యాటింగ్ అస్సలు మిస్ కాడు.'అని చెప్పాను. దానికి విరాట్ కోహ్లీ 'రియల్లీ...' అంటూ సర్‌ప్రైజ్ అయ్యాడు. నేను... 'అవును... నీ కవర్ డ్రైవ్ అంటే అతనికి పిచ్చి.' అంటూ చెప్పాను. అతను నవ్వుతూ వెళ్లిపోయాడు. ఆ టెస్టు మ్యాచ్ అయిన తర్వాత విరాట్ నా దగ్గరికి వచ్చి తన టెస్టు జెర్సీ ఇచ్చాడు. దానిపైన కెప్టెన్ విరాట్ కోహ్లీ... అడ్రెస్ టు ప్రిస్టన్' అని ఆటోగ్రాఫ్ ఇచ్చాడు... ఇప్పుడు ఆ జెర్సీ, నా కొడుకు రూమ్‌లో అలాగే ఉంది.' అని బ్రెట్ లీ తెలిపాడు.

ఆస్ట్రేలియా తరుపున 76 టెస్టులు, 221 వన్డేలు ఆడిన బ్రెట్ లీ, తన కెరీర్‌లో 690 వికెట్లు పడగొట్టాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌పై హ్యాట్రిక్ తీసిన బ్రెట్ లీ, టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి బౌలర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు.

Story first published: Thursday, July 14, 2022, 13:16 [IST]
Other articles published on Jul 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+