వైభవ్ సూర్యవంశీ వయసు 15 కాదు 18.. అయితే ఏంటీ?: బ్రెట్ లీ
టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ వయసు మీద జరుగుతున్న చర్చపై ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ బ్రెట్ లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయితే వచ్చిన సమస్య ఏంటి? అని ప్రశ్నించాడు. అతని వయసుతో ఎవరికి పనని? అతను అద్భుతంగా ఆడుతున్నాడని కొనియాడాడు.
వైభవ్ సూర్యవంశీ అద్వితీయమైన బ్యాటింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్న ఈ టినేజ్ సెన్సేషన్.. అతి పిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భారత ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో అద్భుతంగా ఆడిన వైభవ్ సూర్యవంశీ.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను సొంతం చేసుకున్నాడు.

వయసు ఎవడికి కావాలి..?
తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన బ్రెట్ లీ.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'వైభవ్ సూర్యవంశీ ఒక అద్భుతం. భారత్ బయట అందరూ అతని వయసు నిజంగా 15 ఏళ్లేనా? అని అడుగుతున్నారు. అతని వయసు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కానీ నాకు అతని వయసుతో పనిలేదు.
అతనికి 15 ఏళ్ల లేదా 18 ఏళ్లా.. అనేది ఎవరికి కావాలి? ఆ అబ్బాయి అసాధారణంగా క్రికెట్ ఆడగలడు. అతను భారత్‌కు దొరికిన గొప్ప ఆణిముత్యం. భవిష్యత్తులో మరెన్నో రికార్డులను అందుకుంటాడు.'అని బ్రెట్ లీ కొనియాడాడు.
అనవసర ఒత్తిడి తీసుకురావద్దు..
ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా పేసర్లకు చాలా మంది సీనియర్ బ్యాటర్లు ఇబ్బంది పడితే.. వైభవ్ సూర్యవంశీ అవలీలగా ఆడాడని గుర్తు చేశాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ పేసర్లను ఎదుర్కొన్న తీరు అమోఘమని చెప్పుకొచ్చాడు. 'వైభవ్.. అతి తక్కువ సమయంలోనే ఐపీఎల్ స్టార్‌గా ఎదిగాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 97 పరుగులు చేసిన తీరు.. ఆసీస్ బౌలర్లను ఆడిన విధానం అద్భుతం.
ఆసీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు చాలా మంది బ్యాటర్లు ఇబ్బంది పడితే వైభవ్ అలవోకగా ఆడాడు. అతను సరైన క్రికెటింగ్ షాట్స్ ఆడాడు. అతనిలో అపారమైన శక్తి ఉంది. కేవలం అతని మానసిక స్థితి వల్లే ఇలా ఆడగలుగుతున్నాడు. వైభవ్ వయసు అంశాన్ని పక్కన పెట్టి అతన్ని ఒక చిన్నపిల్లాడిగా ఉండనివ్వాలి. అనవసరమైన ఒత్తిడి తీసుకురావద్దు.'అని బ్రెట్ లీ సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

