Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తెలుగు హీరోయిన్‌తో డేటింగ్ చేయలేదు:బ్రెట్ లీ

బాలీవుడ్ హీరోయిన్, పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటాతో తాను ప్రేమయాణం నడిపినట్లు జరిగే ప్రచారాన్ని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ బ్రెట్ లీ ఖండించాడు. ప్రీతి జింటాతో తాను డేటింగ్ చేయలేదని, ఆమె తనకు గొప్ప స్నేహితురాలు మాత్రమేనని స్పష్టం చేశాడు.

ఐపీఎల్ ఆరంభంలో బ్రెట్ లీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడాడు. ఆ సమయంలో ఆ జట్టు కో ఓనర్ అయిన ప్రీతి జింటాతో బ్రెట్‌ లీ కాస్త సన్నిహితంగా ఉండటంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ రెస్టారెంట్స్ వెళ్లడం, ప్రమోషనల్ ఈవెంట్స్‌లో కలిసి కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఇప్పటికీ ఈ వార్తలు ఆడగడం లేదు.

ఆ తెలుగు హీరోయిన్ కోసం పోటీపడుతున్న ఐపీఎల్ స్టార్స్! (వీడియో)

ఆ తెలుగు హీరోయిన్ కోసం పోటీపడుతున్న ఐపీఎల్ స్టార్స్! (వీడియో)

ఆమె నా బెస్ట్ ఫ్రెండ్..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రెట్ లీ.. ఈ రూమర్స్‌కు చెక్ పెట్టాడు. ప్రీతి జింటానే కాదు ఏ బాలీవుడ్ హీరోయిన్‌తో తాను డేటింగ్ చేయలేదన్నాడు. 'నేనే బాలీవుడ్ హీరోయిన్‌తో డేటింగ్ చేయలేదు. ప్రీతి జింటా నాకు గొప్ప స్నేహితురాలు. ఇప్పటికీ మా మధ్య స్నేహం అలానే ఉంది. ఆ రోజుల్లో ఆమె పంజాబ్ జట్టుగా ఓనర్‌గా ఉండేది.

Brett Lee Breaks Silence on Preity Zinta Dating Rumours Says We re Just Good Friends
Photo Credit: X (twitter)

ఆమె చాలా తెలివైన మహిళ. ఆమె అంటే నాకు చాలా గౌరవం. ఆమెతో డేటింగ్ వార్తలు నన్ను ఎప్పుడూ బాధించలేదు. ఎందుకంటే నిజమేంటో నాకు తెలుసు. జనాలకు కావాల్సిన పుకార్లు పుట్టించుకోవచ్చు. కానీ అవి నన్ను ఏ మాత్రం ప్రభావితం చేయవు.'అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.

అరిగిపోయిన వార్త..

ఈ వార్తలను ప్రీతి జింటా కూడా గతంలో ఖండించింది. ఎక్స్‌ వేదికగా సెటైరికల్ పోస్ట్‌తో ఈ రూమర్స్‌కు ప్రీతి జింటా చెక్ పెట్టింది. 'ప్రతీ ఏడాది బ్రెట్‌లీతో నా ప్రేమాయణం అంటూ మాట్లాడటం అరిగిపోయిన,నిస్సారమైన వార్త. క్షమించండి ఫ్రెండ్. ఇక్కడ కొత్త వార్తలు లేవు. అవును ఫ్రెండ్స్'అంటూ ట్వీట్ చేసింది.

Preity Zinta: ఆ క్రికెటర్‌ను చూసి కన్నుగీటిన సొట్టబుగ్గల సుందరి.. వీడియో వైరల్

Also Read

Preity Zinta: ఆ క్రికెటర్‌ను చూసి కన్నుగీటిన సొట్టబుగ్గల సుందరి.. వీడియో వైరల్

బ్రెట్ లీకి రెండు పెళ్లిలు..

బ్రెట్‌ లీ 2006లో ఎలిజబెత్ కెంప్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఒక కొడుకు పుట్టాడు.అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2009 విడాకులు తీసుకున్నారు. 2014లో లానా అండర్సన్‌ను బ్రెట్ లీ రెండో వివాహం చేసుకున్నాడు. ఏడాది పాటు డేటింగ్ చేసిన ఈ ఇద్దరూ ఆ తర్వాత ఒక్కటయ్యాడు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు.

ప్రీతి జింటా పెళ్లి అయ్యే వరకు ఆమె ప్రేమాయణం వార్తలు హల్ ఛల్ చేశాయి. ప్రముఖ వ్యాపారవేత్త, పంజాబ్ కింగ్స్ కో ఓనర్ నెస్ వాడియాతో ప్రీతి జింటా డేటింగ్ చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. 2016లో లాస్‌ ఎంజెల్స్‌కు చెందిన జెట్ గుడెనఫ్‌ను ప్రీతి జింటా పెళ్లి చేసుకుంది. 2021లో సరోగసి ద్వారా కవల పిల్లలకు ప్రీతి జింటా జన్మనిచ్చింది.

కోహ్లీ X కుంబ్లే గొడవ వల్లే కోచ్ పదవికి దరఖాస్తు చేశా: వీరేంద్ర సెహ్వాగ్</a><a class=" width="200" height="113">

Recommended For You

కోహ్లీ X కుంబ్లే గొడవ వల్లే కోచ్ పదవికి దరఖాస్తు చేశా: వీరేంద్ర సెహ్వాగ్

ప్రేమంటే ఇదేరా సినిమాతో..

ప్రీతి జింటా టాలీవుడ్‌తోనే సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. కెరీర్‌ ప్రారంభంలో ఈ సొట్ట బుగ్గల సుందరి రెండు తెలుగు సినిమాల్లో నటించింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ప్రేమంటే ఇదేరా(1998), సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన రాజకుమారు(1999) సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ హిట్‌గా నిలవడంతో ప్రీతి జింటాకు మంచి గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం ప్రీతి జింటా రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బత్వారా 1947 చిత్రంలో సన్నీ డియోల్, షబానా అజ్మీలతో కలిసి నటిస్తుంది. ఇదే కాకుండా ఆమె చేతిలో కునాల్ కెమ్ము దర్శకత్వంలోని వైబ్ అనే చిత్రం కూడా ఉంది.

Story first published: Tuesday, August 4, 2026, 15:27 [IST]
Other articles published on Aug 4, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+